స్టార్ ట్యాగ్ ల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అడవి శేష్...

Adivi Sesh: యువ హీరో అడవి శేష్ తాజాగా ఇప్పుడు "మేజర్" అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు...

Shireesha
Updated on: 24 May 2022 2:15 PM IST
Adivi Sesh Shocking Comments on Star Tags in Tollywood Industry | Live News
X

స్టార్ ట్యాగ్ ల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అడవి శేష్...

Adivi Sesh: యువ హీరో అడవి శేష్ తాజాగా ఇప్పుడు "మేజర్" అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 26/11 ఎటాక్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా జూన్ 3న థియేటర్లలో విడుదల కాబోతోంది. ప్రస్తుతం అడవి శేష్ ఈ చిత్ర ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో #ఆస్క్ శేష్ అంటూ అభిమానులతో ఒక చిట్చాట్ లో కూడా పాల్గొన్నాడు అడవి శేష్.

అక్కడ అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆసక్తికరమైన జవాబులు ఇచ్చిన అడవి శేష్ ఇప్పుడు స్టార్ల గురించి చేసిన కామెంట్ తో వార్తల్లో నిలిచాడు. త్రిల్లింగ్ స్టార్ అనే టాగ్ ని పొందడం ఎలా ఉంది అని ఒక అభిమాని అడగగా "కటౌట్ ఉన్నప్పుడు టైటిల్ అవసరం లేదు. కంటెంట్ ఉన్నప్పుడు కటౌట్ అవసరం లేదు. మేజర్ సినిమా చూస్తే అది మీకే అర్థం అవుతుంది" అని అడవి శేష్ చెప్పటం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

దాదాపు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరికీ ఏదో ఒక ట్యాగ్ ఉంది. కానీ ఇప్పుడు ఇలాంటి ట్యాగ్ ల గురించి శేష్ షాకింగ్ కామెంట్లు చేయడం అభిమానులను సైతం నిరాశకు గురి చేసింది. ఇక మరోవైపు "మేజర్" కచ్చితంగా హిట్ అవుతుందని అడవి శేష్ విశ్వసిస్తున్నారు. సాయి మంజ్రేకర్ మరియు శోభితా ధూళిపాళ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Shireesha

Shireesha

Next Story