Major: 'మేజర్' ఆల్ ఇండియా మూవీ: అడవి శేష్

Major: "మేజర్" సినిమా నుంచి మరో అప్ డేట్ అందించాడు అడవి శేష్.

Venkata Chari
Published on: 4 April 2021 3:10 PM IST
Adivi Sesh shares first look of Major actress Saiee Manjrekar
X

అడవి శేష్, సాయి మంజ్రేకర్ (ఫొటో ట్విట్టర్)

Major: "మేజర్" సినిమా నుంచి మరో అప్ డేట్ అందించాడు అడవి శేష్. ఈ సినిమా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మేజర్ సందీప్ భార్య పాత్రను పరిచయం చేశారు అడవి శేష్.

మేజర్ సందీప్ భార్య పాత్రలో సాయి మంజ్రేకర్ నటిస్తుండగా, ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను నటుడు ఆడవి శేష్ ఆవిష్కరించారు. పోస్టర్ లో అడవి శేష్ తోపాటు సాయి మంజ్రేకర్ కనిపిస్తారు. సాయి మంజ్రేకర్, అడవి శేషులు ఒక స్కూల్ లో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు పంచుకున్నాడు అడవి శేష్.

ఈ సినిమా ను దేశ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. అయితే, పాన్ ఇండియా సినిమా అంటూ సోషల్ మీడియాతో పాటు టీవీల్లో కూడా మాట్లాడుతున్నారు. అయితే, తాజాగా అడవి శేషు ట్విట్టర్ లో స్పందిస్తూ.. ఇది కేవలం పాన్ ఇండియా సినిమా మాత్రమే కాదు.. ఇదో ఆల్ ఇండియా మూవీ అంటూ పేర్కొన్నాడు. సందీప్ ఉన్ని కృష్ణన్ ఎంతో మందికి ఇన్సిపిరేషన్ అని, అందుకే ఆయనను వెండి తెరపై చూడాలని కోరుకుంటున్నారు అని వెల్లడించాడు. సోనీ సంస్థతో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను ఈనెల 12న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

Venkata Chari

Venkata Chari

Next Story