Adivi Sesh: మామూలుగా ఉండదు: అడవి శేష్

Adivi Sesh: 'మేజర్.. మాములుగా ఉండదు.. నేను ప్రామిస్ చేస్తున్నా' అని అంటున్నాడు యంగ్ హీరో అడివి శేష్.

Venkata Chari
Published on: 26 May 2021 5:49 PM IST
Adivi Sesh Said Major Movie Release Date Gets Postponed | Mahesh Babu Major Movie Updates
X

మేజర్ సినిమాలో అడివి శేష్ (ఫొటో ట్విట్టర్)

Adivi Sesh: 'మేజర్.. మాములుగా ఉండదు.. నేను ప్రామిస్ చేస్తున్నా' అని అంటున్నాడు యంగ్ హీరో అడివి శేష్. ఆయన హీరోగా నటించిన మేజర్ సినిమాపై ట్వీట్ చేసిన సందర్భంగా అలా అన్నాడు. ముంబయి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌ జీవితంపై ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా షూటింగ్ అంతా పూర్తయింది. జులై 2న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం కరోనాతో థియేటర్లు మూతపడడంతో.. విడుదలను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

కరోనాతో దేశవ్యాప్తంగా ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకే 'మేజర్‌' సినిమా విడుదలను వాయిదా వేస్తున్నామని అడివి శేష్‌ ట్విట్టర్లో ప్రకటించారు. దేశంలో పరిస్థితులు ఓ కొలిక్కి వచ్చాక రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఇలాంటి సమయంలో ప్రతిఒక్కరూ సురక్షితంగా ఇంటివద్దనే ఉండాలని ఆయన సూచించారు. శశికిరణ్‌ తిక్కా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి మహేశ్‌ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శోభితా దూళిపాళ్ల, సయీ మంజ్రేకర్‌ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.


Venkata Chari

Venkata Chari

Next Story