Major Glimpse: అడవి శేష్ 'మేజర్' గ్లింప్స్ రిలీజ్

Major Glimpse: తెలుగు చిత్ర సీమలో యంగ్ అండ్ టాలెంటెడ్ నటుల్లో అడవి శేష్ ఒకరు. వైవిధ్యమైన పాత్రలతో అలరింస్తుంటాడు.

Venkata Chari
Published on: 15 March 2021 4:41 PM IST
Adivi Sesh Major Glimpse On Major Sandeep Unnikrishnans Birth Anniversary and Major Teaser on 28th March
X
మేజర్ మూవీలో అడవి శేష్ (ఫొటో ట్విట్టర్)

Major Glimpse: తెలుగు చిత్ర సీమలో యంగ్ అండ్ టాలెంటెడ్ నటుల్లో అడవి శేష్ ఒకరు. కొత్త కథలతో, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరింస్తుంటాడు. క్ష‌ణం, గూఢచారి, ఎవ‌రు వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి అడవి శేష్ ప్రస్తుతం "మేజర్" సినిమా తెరకెక్కిస్తున్నాడు. 26/11 దాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన బర్త్ డే సందర్భంగా, ఆయనను స్మరించుకుంటూ మేజర్ మూవీ గ్లింప్స్ ను మహేశ్ బాబు సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు.

పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాను జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ప‌తాకాల‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్‌ లుక్‌ రిలీజ్ అయి ఆకట్టుకుంది. అయితే, ఈ మూవీ టీజర్ ను మార్చి 28న రిలీజ్ చేస్తున్నట్లు గ్లింప్స్ లో ప్రకటించారు మూవీ యూనిట్. ఈ మూవీని 2021, జూలై 2న రిలీజ్ కానుంది.

ఈ సినిమాకి 'గూఢ‌చారి' ఫేం శ‌శి కిర‌ణ టిక్కా ద‌ర్శకత్వం వహిస్తున్నాడు. సూపర్‌స్టార్ మహేష్ బాబు ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. శోభితా ధూళిపాళ్ల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆదరిస్తోందో చూడాలి.


Venkata Chari

Venkata Chari

Next Story