Adivi Sesh: రెమ్యూనరేషన్ పెంచిన అడవి శేష్..

* వరుసగా సూపర్ హిట్ సినిమాలతో అడవి శేష్ తనకంటూ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారని చెప్పుకోవాలి

Jyothi
Updated on: 22 Dec 2022 6:00 PM IST
Adivi Sesh: రెమ్యూనరేషన్ పెంచిన అడవి శేష్..
X

Adivi Sesh: చేసే ప్రతి సినిమాతోనూ తనపై ఉన్న క్రేజ్ ను పెంచుకుంటూ వెళుతున్న హీరోలలో అడవి శేష్ పేరు ముందే ఉంటుంది. కమర్షియల్ సినిమాలకి దూరంగా కేవలం కంటెంట్ ఉన్న సినిమాలతో మాత్రమే ప్రేక్షకులను మెప్పించడం లో అడవి శేష్ తర్వాతే ఎవరైనా. వరుసగా సూపర్ హిట్ సినిమాలతో అడవి శేష్ తనకంటూ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారని చెప్పుకోవాలి. అతి తక్కువ సమయంలోనే అడవి శేష్ ఎన్నో మంచి సినిమాలను అందించారు.

ఈ మధ్యనే విడుదలైన "హిట్: ది సెకండ్ కేస్" సినిమా అద్భుతమైన కలెక్షన్లతో అడవి శేష్ టైర్ 2 హీరోగా కూడా మారిపోయారు. తాజాగా ఈ నేపథ్యంలో అడవి శేష్ రెమ్యూనరేషన్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది.అడవి శేష్ తాజాగా ఇప్పుడు తన రెమ్యూనరేషన్ ని పెంచినట్లు తెలుస్తోంది. గూడచారి, ఎవరు, మేజర్, హిట్ వంటి వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో అడవి శేష్ మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయారు. దీంతో ఒక్కో సినిమాకి ఇప్పుడు అడవి శేష్ నాలుగు కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక నిర్మాతలు కూడా అడవి శేష్ కు ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ కారణంగా అడిగిన రేమ్యూనరేషన్ ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరాలు చెప్పటం లేదు. అంతేకాకుండా స్టార్ నిర్మాతలు సైతం ఇప్పుడు అడవి శేష్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఇప్పుడు "హిట్ 2" కి సీక్వెల్ అయిన "హిట్ 3" లో కూడా అడవి శేష్ కనిపించనున్నారు. నాని ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. విశ్వక్ సేన్ కూడా కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమాకి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story