Adivi Sesh: మేజర్ గురించి క్లారిటీ ఇచ్చిన అడివి శేష్

Adivi Sesh - Major Movie Trailer: మేజర్ ట్రైలర్ అప్పుడే అంటున్న అడవి శేష్

admin1
Updated on: 10 Dec 2021 2:16 PM IST
Adivi Sesh gave Clarity about the Major  Movie Trailer | Tollywood New Movie Updates
X

మేజర్ ట్రైలర్ గురించి క్లారిటీ ఇచ్చిన అడివి శేష్ (ఫైల్-ఫోటో)

Adivi Sesh - Major Movie Trailer: ఎప్పుడో 2019 లో "ఎవరు" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అడవి శేష్ అప్పటినుండి "మేజర్" షూటింగ్ తో బిజీగా నే ఉన్నారు. శశి కిరణ్ టిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు.

2008 ముంబై అటాక్ ఆధారంగా అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే తాజాగా అభిమానులతో సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉన్న అడవి శేష్ ఈ సినిమా గురించి అడిగిన ఒక అభిమానికి రిప్లై ఇచ్చారు.

సినిమా ట్రైలర్ ని ఎప్పుడు విడుదల చేయబోతున్నారని ఒక అభిమాని అడగగా మేజర్ సినిమా ట్రైలర్ జనవరిలో విడుదల అవుతుందని తెలిపారు శేష్. అయితే ట్రైలర్ విడుదల తేదీ గురించి మాత్రం అడవి శేష్ క్లారిటీ ఇవ్వలేదు. శోభితా ధూళిపాళ మరియు సాయి మంజ్రేకర్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రేవతి నాయర్, మురళి శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధమవుతోంది.

admin1

admin1

Next Story