Siddharth-Adithi Rao Hydari: ఆ పురాతన దేవాలయంలో పెళ్లి చేసుకున్న సిద్దార్థ్, అదితిరావు హైదరీ

Siddharth-Aditi Rao Hydari: టాలీవుడ్ హీరోహీరోయిన్ సిద్ధార్థ్, అదితి రావు హైదరీ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

Arun Chilukuri
Updated on: 16 Sept 2024 12:24 PM IST
Aditi Rao Hydari And Siddharth get Married
X

Siddharth-Adithi Rao Hydari: ఆ పురాతన దేవాలయంలో పెళ్లి చేసుకున్న సిద్దార్థ్, అదితిరావు హైదరీ

Siddharth-Aditi Rao Hydari: టాలీవుడ్ హీరోహీరోయిన్ సిద్ధార్థ్, అదితి రావు హైదరీ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని 400 ఏళ్ల పురాతన రంగనాథస్వామి ఆలయంలో ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. సౌత్ ఇండియన్ సంప్రదాయ పద్దతిలో వీరిద్దరి వివాహం జరిగింది.

ఇరు కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సిద్ధార్థ్, అదితి ఏడడుగులు వేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. నూతన జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.

తాజాగా సోమవారం (సెప్టెంబర్ 16న) వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోస్ ను హీరోయిన్ అదితి ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. "నువ్వే నా సూర్యుడు, నా చంద్రుడు మరియు నా నక్షత్రాలన్నీ..."శాశ్వతత్వం కోసం నీతో సోల్‌మేట్స్‌గా ఉండటానికి...నవ్వడానికి, ఎప్పటికీ..ఎటర్నల్ లవ్, లైట్ & మ్యాజిక్..శ్రీమతి & మిస్టర్ అండ్ -సిద్ధు" అంటూ తన బ్యూటీఫుల్ ఫీలింగ్ ను తెలిపింది అదితి.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story