Adipurush: ఆదిపురుష్ అదిరే ఆఫర్.. ఒక టికెట్ కొంటే ఇంకోటి ఫ్రీ..!

Adipurush: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్..రాముడిగా నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్.

Arun Chilukuri
Updated on: 12 May 2023 2:00 PM IST
Adipurush Ticket Offers Buy one Get One Free
X

Adipurush: ఆదిపురుష్ అదిరే ఆఫర్.. ఒక టికెట్ కొంటే ఇంకోటి ఫ్రీ..!

Adipurush: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్..రాముడిగా నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్..బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రామాయణం కథాంశంతో రూపొందించిన ఈ సినిమా జూన్ 16న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. బాలీవుడ్ నిర్మాణ సంస్థలు టీసిరీస్, రెట్రో ఫైల్స్ ఈ చిత్రాన్ని రూ.600 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా తెలుగులో యూవీ క్రియేషన్స్ ఈ సినిమాని రీలీజ్ చేస్తోంది.

ఆదిపురుష్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల సమయంలో చాలా నెగిటివిటీని ఎదుర్కొంది. అయితే మే9 రిలీజ్ చేసిన ట్రైలర్ తో అనుమానాలన్నీ పటాపంచలు అయ్యాయి. ఓం రౌత్ సిల్వర్ స్క్రీన్ పై విజువల్ వండర్ చూపించబోతున్నాడని ట్రైలర్ రాకతో ప్రేక్షకులకు ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఏర్పడింది. సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయిన తరుణంలో చిత్ర నిర్మాతలు ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు.

ఆదిపురుష్ సినిమాకు ఒక టికెట్ కొంటే మరో టికెట్ ను ఫ్రీగా పొందే అవకాశాన్ని మేకర్స్ కల్పించారు. అయితే ఇందుకు పేటీఎం ద్వారా టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పేటిఎం ద్వారా ముందుగా మన రూ.100 చెల్లించాలి. అలా చెల్లించగానే మనకు ప్రోమో కోడ్ వస్తుంది. టికెట్ బుక్ చేసుకునే ముందు దాన్ని మనం అప్లై చేసుకుంటే రూ.400 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అయితే ఈ ఆఫర్ కనీసం రూ.350 ధర ఉన్న టికెట్ కే ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెండు టికెట్స్ బుక్ చేయాల్సి వస్తే మనకు రూ.700లకు పైగా అవుతుంది. అదే పేటీఎం ఆఫర్ కోడ్ ఉపయోగిస్తే సగానికి తగ్గుతుంది.

ఆదిపురుష్ ఇస్తున్న ఈ ఆఫర్ పై నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. టికెట్స్ రేట్స్ ద్వారా పెట్టిన బడ్జెట్ ను రాబట్టుకోవాలని మేకర్స్ ప్రయత్నిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆదిపురుష్ టీమ్ మాత్రం ఇలా ఫ్రీ ఆఫర్ ఇవ్వడాన్ని అందర్ని ఆశ్చర్యపరుస్తోంది. అయితే, వన్ ప్లస్ వన్ ఆఫర్ జూన్ 30 వరకే వర్తిస్తుంది.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story