తిరుమలలో కృతిసనన్‌కు ఓం రౌత్ కౌగిలింతలు, ముద్దులు.. దర్శకుడి తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు..

Om Raut: హీరోయిన్ కృతిసనన్‌కు ఓం రౌత్ కౌగిలింతలు, ముద్దులు

Jyothi
Updated on: 7 Jun 2023 2:30 PM IST
Adipurush Om Raut Kisses Kriti Sanon in Tirumala temple
X

Om Raut: తిరుమలలో ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ అపచారం 

Om Raut: ఆదిపురుష్ డైరెక్టర్, హీరోయిన్ కృతిసనన్ తీరు వివాదాస్పదమవుతోంది. తిరుమల శ్రీవారిని ఉదయం ఆదిపురుష్ చిత్ర బృందం దర్శించుకుంది. స్వామి వారి దర్శనం అనంతరం ఆలయం బయటకు వచ్చిన తర్వాత దర్శకుడు ఓం రౌత్ ప్రవర్తించిన తీరు వివాదస్పదంగా మారింది. దర్శనం పూర్తి చేసుకుని వెళ్లబోతున్న కృతి సనన్‌ను హగ్ చేసుకుని ఆమె చెంపపై దర్శకుడు ఓం రౌత్ ముద్దు పెట్టుకున్నారు.

డైరెక్టర్ ఓం రౌత్ తీరుపై విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి. పవిత్ర పుణ్య క్షేత్రంలో స్వామి వారి దర్శనం చేసుకున్న తర్వాత ఆలయం బయట ఇలా ముద్దు పెట్టుకోవటాలు, ఆలింగనాలు లాంటివి సరైన పద్ధతి కాదంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story