Adipurush: శుక్రవారం రిలీజ్ అయిన ఆదిపురుష్ సినిమా.. పలు సంభాషణలు మార్చాలని ప్రేక్షకుల సూచనలు

Adipurush: బాక్సాఫీస్ వద్ద రికార్డ్ లు బద్దలు కొడుతున్న ఆదిపురుష్

Shekhar G
Published on: 18 Jun 2023 2:10 PM IST
Adipurush Movie Released On Friday Across The Country
X

Adipurush: శుక్రవారం రిలీజ్ అయిన ఆదిపురుష్ సినిమా.. పలు సంభాషణలు మార్చాలని ప్రేక్షకుల సూచనలు

Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించిన చిత్రం ఆదిపురుష్. ఇటీవలే విడుదలై ప్రపంచవ్యాప్తంగా అద్భుత విజయం సాధించింది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటున్న ఈ సినిమాకు రికార్డ్ స్థాయి కలెక్షన్స్ వస్తున్నాయి. ఆదిపురుష్ మేకింగ్ లోని సాంకేతికత, గ్రాఫిక్స్ , విజువల్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తున్నాయి. అయితే ఈ చిత్రంలోని కొన్ని సంభాషణల విషయంలో కొంతమంది ప్రేక్షకులు చిత్ర యునిట్ కు సూచనలు చేస్తున్నారు. వారి సూచనలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు తాజాగా చిత్రబృందం కూడా ప్రకటించింది.

ప్రేక్షకుల సూచనలు గౌరవిస్తూ ఆదిపురుష్ చిత్రంలోని కొన్ని డైలాగ్స్ మార్చబోతున్నారు. సినిమాలో ఇప్పుడున్న థీమ్ కొనసాగిస్తూనే ఆ మార్చిన సంభాషణలు ఉంటాయని చిత్ర బృందం తెలిపింది. కొద్ది రోజుల్లోనే ఈ మార్పులతో ఆదిపురుష్ సినిమాను మనం థియేటర్ లో చూడవచ్చు. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయి విజయం వైపు వెళ్తున్న ఈ చిత్రంలోని డైలాగ్స్ మార్పులు చిత్ర యునిట్ కు ఒక సాహసం లాంటిదే. అయినా ప్రేక్షకుల మనోభావాలను గౌరవించడం అన్నింటి కన్నా ముఖ్యమని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story