Adipurush: మరో వివాదంలో చిక్కుకున్న ఆదిపురుష్ మూవీ

Adipurush: మత పరమైన మనోభావాలను దెబ్బతిస్తున్నారని..

Dhatripriya
Updated on: 6 April 2023 10:31 AM IST
Adipurush Movie Poster Is In Another Controversy
X

Adipurush: మరో వివాదంలో చిక్కుకున్న ఆదిపురుష్ మూవీ

Adipurush: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఆదిపురుష్. ఈ సినిమా తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. ఆదిపురుష్ శ్రీరామ నవమి పోస్టర్ పై పలువురు ఫిర్యాదులు చేశారు. శ్రీరాముడి లుక్ పై విమర్శలు చేస్తున్నారు.

ప్రభాస్‌ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆదిపురుష్, బాలీవుడ్‌లో అతిపెద్ద ప్రాజెక్టులో ప్రభాస్ ఒకటి. ఇటీవల శ్రీరామ నవమి సందర్భంగా ఆదిపురుష్ సినిమా కొత్త పోస్టర్‌ విడుదలైంది. ఈ పోస్టర్ హిందువుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఆరోపిస్తూ ముంబైలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆదిపురుష్ నిర్మాతలు చిక్కుల్లో పడ్డారు.

రామచరిత మానస్‌లో రాముడి ఆహార్యం, స్వభావానికి విరుద్ధంగా ఆదిపురుష్ లుక్ ఉందని ఫిర్యాదుదారుడు సంజయ్ తెలిపారు. హిందూ సనాతన ధర్మం రామచరిత మానస్‌కి అనుగుణంగా ఉంటుందని.. కారణ జన్ముడైన శ్రీరాముడి కాస్ట్యూమ్స్ అభ్యంతరకరంగా సనాతన ధర్మానికి విరుద్ధంగా ఉందిని ఫిర్యాదులో తెలిపారు. రామచరిత మానస్‌లో వర్ణించిన విధంగా అతి ముఖ్యమైన జంధ్యం లేదని సంజయ్ ఆరోపించారు.

రాముడి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జరుపుకునే పండుగైన రామనవమి శుభ సందర్భంగా ఆదిపురుష్ నిర్మాతలు పోస్టర్‌ను ఆవిష్కరించారు. కొత్త పోస్టర్‌లో, ప్రభాస్, సన్నీ కవచం, ధోతీ ధరించి విల్లు బాణంతో కనిపిస్తున్నారు. సీత పాత్రలో నటించిన కృతి సాధారణ చీరలో తలపై కొంగు కప్పుకుని ఉంది, హనుమంతునిగా నటించిన దేవదత్తా ఈ ముగ్గురి సేవలో వంగి నమస్కారాలు పెడుతున్నట్లు పోస్టర్ ఆవిష్కరించారు. తాజాగా పోస్టర్ పై వివాదం చెలరేగింది.

Dhatripriya

Dhatripriya

Next Story