Adipurush Movie: ఆదిపురుష్‌ వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన ఓం రౌత్‌

Adipurush Movie: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న "ఆది పురుష్" సినిమా విడుదల వాయిదా పడింది.

Arun Chilukuri
Published on: 7 Nov 2022 10:49 AM IST
Adipurush Movie New Released Date Conformed
X

Adipurush Movie: ఆదిపురుష్‌ వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన ఓం రౌత్‌

Adipurush Movie: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న "ఆది పురుష్" సినిమా విడుదల వాయిదా పడింది. జనవరి 12న విడుదల కావాల్సిన ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు బాలివుడ్ చిత్ర దర్శకుడు ఓమ్ రౌత్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ఈ సినిమా జనవరి 12న విడుదల కావాల్సి ఉండగా... 2023 జూన్ 16వ తేదీకి వాయిదా వేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. కాగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కనుంది.

"ఆది పురుష్" సినిమా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అందరూ అనుకున్నట్టుగానే వచ్చే ఏడాది జూన్ 16వ తేదీకి వాయిదా పడింది.. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ లభించింది. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ఏ మాత్రం బాగోలేవని, కార్టూన్స్‌లాగా ఉన్నాయని ప్రభాస్ అభిమానులు దర్శక, నిర్మాతలపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సినిమా విజువల్ ఎఫెక్ట్స్‌పై మరొకసారి పనిచేయనుందట.

టీజర్‌కు ప్రేక్షకుల నుంచి నెగటివ్ రెస్పాన్స్ రావడంతో దర్శక నిర్మాతలపై బాగా ప్రెషర్ పడింది. దీంతో వారు సినిమా విజువల్స్ మొత్తాన్ని రీడూ చేయాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం దాదాపు 100 కోట్ల రూపాయల ఖర్చవ్వబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమా విడుదల కూడా వాయిదా పడింది. సీత పాత్రలో కృతిసనన్, రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటిస్తున్నారు. టీ సిరీస్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకి అజయ్ అతుల్ సంగీతాన్ని అందిస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story