Adipurush: సెన్సార్ పూర్తి చేసుకున్న ఆదిపురుష్.. రన్ టైమ్ ఎంతంటే?

Adipurush: డార్లింగ్ ప్రభాస్ నుంచి వస్తున్న మరో పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్.

Arun Chilukuri
Updated on: 8 Jun 2023 4:00 PM IST
Adipurush Gets Censored
X

Adipurush: సెన్సార్ పూర్తి చేసుకున్న ఆదిపురుష్.. రన్ టైమ్ ఎంతంటే?

Adipurush: డార్లింగ్ ప్రభాస్ నుంచి వస్తున్న మరో పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్. రామాయణం ఇతిహాసంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్..కళ్లు చెదిరే గ్రాఫిక్స్ తో భారీ బడ్జెట్ తో ఆది పురుష్ సినిమాని రూపొందించారు. ఇక రిలీజ్ అయిన రెండు ట్రైలర్స్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. సాంగ్స్‌కు కూడా భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

తాజాగా ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. సెన్సార్‌ బోర్డు ఈ చిత్రానికి యు (U) సర్టిఫికెట్‌ జారీ చేసింది. ఈ సినిమా నిడివి 2 గంటల 59 నిమిషాలు. ఇక ఆదిపురుష్ సినిమా విడుదలకు రెడీ అవుతుండడంతో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను టీమ్ ఎంతో గ్రాండ్‌గా జరిపింది. జూన్ 6న తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అత్యంత భారీగా నిర్వహించారు. ఇక ఇదే ఈవెంట్‌లో టీమ్ ఫైనల్ ట్రైలర్‌ను వదిలింది. ఈ ట్రైలర్‌కు మంచి ఆదరణ దక్కింది.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story