Adi Purush Live Up Dates: అయోధ్యను మరిపిస్తూ అంగరంగవైభవంగా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్

ప్రభాస్ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వేల సంఖ్యలో అభిమానులు తిరుపతికి చేరుకున్నారు. మైదానంలో ఎటు చూసినా కాషాయ రంగు జెండాలు కనిపిస్తున్నాయి. జై శ్రీరామ్ నినాదాలతో సభా ప్రాంగణం మారుమ్రోగుతోంది.

Dhatripriya
Published on: 6 Jun 2023 8:16 PM IST
Adi Purush Live Up Dates: అయోధ్యను మరిపిస్తూ అంగరంగవైభవంగా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్
X

Adi Purush Live Up Dates: అయోధ్యను మరిపిస్తూ అంగరంగవైభవంగా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్

Adi Purush Live Up Dates: ప్రభాస్ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వేల సంఖ్యలో అభిమానులు తిరుపతికి చేరుకున్నారు. ఈవెంట్ జరుగుతున్న తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ మైదానం జనసంద్రంగా మారింది. ప్రభాస్ సెక్యూరిటీ కోసం 100 మంది పన చేస్తున్నారు. అంతకు ముందే సభా ప్రాంగణాన్ని బాంబ్ స్క్వాడ్ క్షుణ్ణంగా తనిఖీ చేసింది. వేలాదిగా చేరిన ప్రభాస్ అభిమానులు చేతుల్లో కాషాయ జెండాలను పట్టుకోవడంతో సినిమా ఫంక్షనా లేక ఆధ్యాత్మిక కార్యక్రమమా అన్నట్లుగా ప్రాంగణం దర్శనం ఇచ్చింది.

బాహుబలి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా తిరుపతిలో జరిగిన విషయం తెలిసిందే. అప్పుడు ప్రభాస్ ఎలా ఎంట్రీ ఇచ్చాడో అదే విధంగా సభా ప్రాంగణానికి చేరుకోనున్నాడు. ఇదిలా ఉంటే, ప్రీ రిలీజ్ సందర్భంగా సోమవారమే తిరుపతికి చేరుకున్న ప్రభాస్ మంగళవారం వేకువజామున శ్రీవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన ప్రభాస్ కు ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించారు.

ఇక మైదానంలో ఎటు చూసినా కాషాయ రంగు జెండాలు కనిపిస్తున్నాయి. జై శ్రీరామ్ నినాదాలతో సభా ప్రాంగణం మారుమ్రోగుతోంది. సీతారాముల దివ్యచరితను లవకుశుల వేషధారణలో ఉన్న పిల్లలు గానంతో స్టేజ్ పై సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఆదిపురుష్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న రిలీజ్ చేయనున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story