శ్రీదేవి నుంచి తమన్నా వరకు.. తండ్రీకొడుకుల‌తో క‌లిసి న‌టించిన హీరోయిన్లు

Tollywood: అక్కినేని నాగేశ్వరరావు తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించింది

Sandeep Eggoju
Published on: 4 May 2021 5:40 PM IST
Tollywood: Actresses Shared Screen With Father as well as Son in their Movies List
X

Tollywood:

శ్రీదేవి

అక్కినేని నాగేశ్వరరావు తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించింది. అక్కినేని నటవారసుడు నాగార్జునతో కలిసి గోవిందా గోవిందా సినిమాలో హీరోయిన్ గా చేసింది.

తమన్నా

సైరా నరసింహారెడ్డిలో మెగాస్టార్‌ పక్కన మెరిసిపోగా చెర్రీతో కలిసి రచ్చ సినిమాలో రచ్చ చేసింది.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

రారండోయ్‌ వేడుక చూద్దాంలో నాగచైతన్యతో జత కట్టింది. మరోవైపు నాగార్జున హీరోగా నటించిన మన్మథుడు 2లో నాగ్‌ సరసన నటించింది.

ప్రియ‌మ‌ణి

బాల‌య్య‌తో మిత్రుడు సినిమాలో రోమాన్స్ చేసింది. అంత‌కు ముందు ఎన్టీఆర్ తో క‌లిసి య‌మ‌దొంగ సినిమాలో్ న‌టించింది. య‌మ‌దొంగ సినిమాతో ఆమె ఎంట్రీ ఇచ్చింది. ప్రియ‌మ‌ణి నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ తో క‌లిసి హ‌రేరామ్ అనే సినిమాలో కూడా న‌టించింది.

న‌య‌న‌తార‌

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌ బాల‌కృష్ణ స‌ర‌స‌న సింహా, శ్రీరామ‌రాజ్యం సినిమాలో న‌టించింది. ఎన్టీఆర్ స‌ర‌స‌న అదుర్స్ మూవీలో క‌నిపించింది.

త్రిష..

ఎన్టీఆర్ స‌ర‌స‌న ద‌మ్ము సినిమాలో క‌నిపిస్తే.. బాల‌య్య స‌ర‌స‌న ల‌య‌న్ మూవీలో ఆడిపాడింది.

శ్రియ

బాలయ్యతో చెన్నకేశవ రెడ్డి సినిమాలో జతకట్టింది. అబ్బాయ్ జూనియర్ ఎన్టీఆర్ సరసన నా అల్లుడు మూవీలో నటించింది. మరోసారి బాలయ్య తో గౌతమి పుత్ర శాతర్ణి సినిమాలో కనిపించింది.

కాజ‌ల్ అగ‌ర్వాల్

అక్కినేని హీరో నాగచైతన్యతో దడ సినిమాలో నటించింది కాజల్‌. తాజాగా చైతూ తండ్రి నాగార్జున సినిమాలో కాజల్‌ హీరోయిన్‌గా ఎంపికైంది. దీంతో అక్కినేని ఫ్యామిలీలోనూ తండ్రీకొడుకులతో కలిసి నటించినట్లైంది.

మెగా ఫ్యామిలీలో చిరంజీవి ఖైదీ నెం 150లో క‌నిపిస్తే.. రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న మ‌గ‌థీర‌, నాయక్‌, గోవిందుడు అందరివాడేలే సినిమాల్లో జోడీ కట్టిందీ. మ‌రోసారి ఆచార్య సినిమాలో చిరంజీవితో జోడీ కట్టింది.

లావణ్య త్రిపాఠి

నాగార్జునతో సోగ్గాడే చిన్నినాయనా సినిమాలో జోడీ కట్టింది. నాగచైతన్యతో యుద్ధం శరణంలో హీరోయిన్‌గా కనిపించింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story