SP Balasubrahmanyam : బాలు మీ రాక కోసం ఎదురు చూస్తున్నాం : విజయశాంతి

SP Balasubrahmanyam : బాలు మీ రాక కోసం ఎదురు చూస్తున్నాం : విజయశాంతి
x

vijayashanthi ,SP Balasubrahmanyam

Highlights

SP Balasubrahmanyam : దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది.. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కేసులతో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు

SP Balasubrahmanyam : దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది.. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కేసులతో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.. ఇక ఈ కరోనా ప్రభావం ఎక్కువగా సినీ ఇండస్ట్రీ పైన ఉందని చెప్పాలి.. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు.. అందులో ఒకరు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒకరు.. అయనకి కరోనా సోకి ఆగస్టు 05న కరోనా బారిన పడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.. అయన త్వరగా కోలుకోవాలని అభిమానులతో పాటుగా యావత్ సినీ లోకం కోరుకుంటుంది..అందులో భాగంగానే సినీ నటి, కాంగ్రెస్ నేత విజయశాంతి బాలు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నట్టుగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

"బాలు గారు, వారి సుదీర్ఘమైన 54 సంవత్సరాల కళా ప్రస్థానంలో సాధించుకున్న అశేషమైన అభిమానుల ప్రేమ, పూజలతో కచ్చితంగా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని విశ్వసిస్తున్నాను. సౌతిండియన్ సినిమా సాంగ్స్‌కి ఎస్పీబీ పేరు ఒక బ్రాండ్ నేమ్ అనడం అతిశయోక్తి కాదు. డ్యాన్స్ రానివారితో కూడా స్టెప్స్ వేయించే శక్తి... మ్యూజిక్ తెలియనివారితో కనీసం హమ్మింగ్ చేయించే పవర్ బాలు పాటకు సొంతం. కనీసం రెండు తరాల జీవితాలు బాలూ గారి పాటతో పెనవేసుకుని ఉంటాయి. ఒక తరం పూర్తిగా బాలూగారి పాటలు వింటూ పెరిగింది.

ఎస్పీబీ గారు తన గానంతో అలరించడమే కాకుండా... టీవీ షోల ద్వారా ఎందరో గాయనీగాయకుల్ని ప్రోత్సహించి, వాళ్ళు కూడా సినీ రంగంలో నిలదొక్కుకునేలా ఊతమిచ్చారు. పాటే కాదు, భావి తరాలకు వినయం, విధేయత లాంటి సుగుణాలు కూడా తెలిసేలా తన ప్రవర్తన ద్వారా నేర్పించారు. ఇవాళ వాళ్ళందరూ బాలూ గారి పాట కోసం మళ్ళీ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మన తెలుగువారే కాదు తమిళం, కన్నడం, మలయాళం... అలాగే ఉత్తరాది రాష్ట్రాల అభిమానులు కూడా ఎస్పీబీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇందరి సంకల్పం... కచ్చితంగా మళ్ళీ బాలుగారు మనకోసం పాడేలా చేస్తుంది" అని విజయశాంతి పోస్ట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories