Varsha Bollamma: విడాకులకు అసలు కారణం అదే.. వర్ష బొల్లమ్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..

Varsha Bollamma: విడాకులకు అసలు కారణం అదే.. వర్ష బొల్లమ్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 20 July 2024 7:00 PM IST
Actress Varsha Bollamma interesting comments what is the reason for divorce
X

Varsha Bollamma: విడాకులకు అసలు కారణం అదే.. వర్ష బొల్లమ్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌.. 

Varsha Bollamma: ప్రస్తుత రోజుల్లో విడాకులు సర్వసాధారణంగా మారిపోయాయి. కొన్ని సంఘటనలు ఎంతో పవిత్రమైన వివాహ వ్యవస్థపై నమ్మకం తగ్గేలా చేస్తున్నాయి. ఇక సామాన్యుల విషయం పక్కన పెడితే సెలబ్రిటీ జంటలకు సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త నిత్యం వైరల్ అవుతూనే ఉంది. దీంతో విడాకులకు సంబంధించి సోషల్‌ మీడియాలో నిత్యం ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంది. తాజాగా అభిషేక్‌, ఐశ్వర్యలు విడాకులు తీసుకున్నారంటూ వచ్చిన వార్తలు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో యంగ్ హీరోయిన్‌ వర్ష బొల్లమ్మ విడాకులకు సంబంధించి ఆసక్తికరమైన కామెంట్ చేసింది. సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే వర్షకు ఇటీవల ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిటిస్ట్‌.. దీపిక నారాయణ్ భరధ్వాజ్, అసలు విడాకులకు కారణం ఏమై ఉంటుంది.? దీనిపై మీ ఉద్దేశం ఏంటని అడిగారు. దీనికి బదులిచ్చిన వర్ష.. విడాకులకు ప్రధాన కారణం పెళ్లే అంటూ బదులిచ్చారు. అంటే అసలు వివాహం చేసుకోవడం వల్లే విడాకులు అవుతాయన్న అర్థం వచ్చేలా వర్ష కామెంట్ చేసింది.

దీంతో ఈ పోస్ట్‌ కాస్త వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ చూసిన పలువురు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పెళ్లిపై వర్షాకు ఇలాంటి అభిప్రాయం ఉందా.? అయితే వర్షాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదా.? అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే వర్ష బొల్లమ్మ కెరీర్ విషయానికొస్తే ఈ బ్యూటీ.. తమిళ ఇండస్ట్రీ ద్వారా వెండి తెరకు పరిచయయమైంది. తర్వాత తెలుగు, మలయాళం, తమిళ వంటి భాషల్లో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ అమ్మడు ఇటీవల సందీప్ కిషన్ ‘ఊరు పేరు భరవకోన’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ ఫిబ్రవరి 16న విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story