వరలక్ష్మి శరత్ కుమార్ సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్!

తమిళ్, తెలుగు సినిమాలలో నటిస్తూ నటిగా తనకంటూ ప్రత్యేమైన గుర్తింపు తెచ్చుకున్నారు నటి వరలక్ష్మి శరత్ కుమార్. అయితే తాజాగా ఆమె ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్స్ హ్యాక్ అయ్యాయి. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఒక ప్రకటనలో వెల్లడించారు.

Krishna
Published on: 3 Dec 2020 4:58 PM IST
వరలక్ష్మి శరత్ కుమార్ సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్!
X

తమిళ్, తెలుగు సినిమాలలో నటిస్తూ నటిగా తనకంటూ ప్రత్యేమైన గుర్తింపు తెచ్చుకున్నారు నటి వరలక్ష్మి శరత్ కుమార్. అయితే తాజాగా ఆమె ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్స్ హ్యాక్ అయ్యాయి. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఒక ప్రకటనలో వెల్లడించారు. తన ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్లను హ్యాక్ చేశారని, వాటిలో తానూ ప్రవేశించలేకపోతున్నానని వరలక్షి వెల్లడించింది. ఆ అకౌంట్లను తిరిగి తానూ పొందుతానని ఆమె ఆశాభావం వ్యక్త్తం చేశారు. అప్పటివరకు తన పేరిట ఇన్ స్టాగ్రామ్ లో కానీ, ట్విట్టర్ లో కానీ ఏవైనా పోస్టులు వస్తే వాటి పట్ల అభిమానులు జాగ్రత్తగా ఉండాలంటూ కోరింది. తన అకౌంట్లు పునరుద్ధరణకు గురైన తర్వాత తానే అభిమాలకు ఆ విషయం తెలియజేస్తానని వరలక్ష్మి వెల్లడించింది.

ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూతురుగా సినిమాల్లోకి వచ్చిన వరలక్ష్మి అనతికాలంలోనే తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది. ప్రస్తుతం తమిళ్, తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా , విలన్ క్యారెక్టర్లలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ప్రసుతం తెలుగులో రవితేజ హీరోగా వస్తున్న క్రాక్ సినిమాలో మెయిన్ లీడ్ లో నటిస్తోంది. డాన్ శీను, బలుపు లాంటి హిట్స్ తర్వాత హీరో రవితేజ, దర్శకుడు పీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో సినిమా పైన మంచి అంచనాలు నెలకొన్నాయి. సరస్వతి ఫిల్మ్స్‌ డివిజన్‌ పతాకంపై బి.మధు ఈ సినిమాను నిర్మిస్తుండగా, తమన్ సంగీతం అందించాడు.

Krishna

Krishna

Next Story