Trisha: వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్న త్రిష..

Trisha: వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్న త్రిష..
x

Trisha: వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్న త్రిష

Highlights

త్రిష రీసెంట్ గా మణిరత్నం పీఎస్ 2 చిత్రంలో మెరిసింది. ఇందులో యువరాణి కుందవై పాత్రలో కనిపించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో త్రిషను చూసి సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు.

Trisha: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన త్రిష ఆ తర్వాత వర్షం సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. వర్షం సినిమా తర్వాత తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి అగ్ర కథానాయకులతో ఆడిపాడింది. తెలుగుతో పాటు తమిళంలో కూడా పలు హిట్ చిత్రాల్లో నటించింది.

త్రిష దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతోంది. అయితే కెరీర్ పరంగా కొంత గ్యాప్ ఇచ్చిన త్రిష 96 సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. రీసెంట్ గా మణిరత్నం పీఎస్ 2 చిత్రంలో మెరిసింది. ఇందులో యువరాణి కుందవై పాత్రలో కనిపించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో త్రిషను చూసి సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు. నాలుగు పదుల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో త్రిష ఆకట్టుకుంది. త్రిష గ్లామరస్ లుక్స్ కి ఫిదా అయిన దర్శకనిర్మాతలు ఆమెకు వరుసపెట్టి అవకాశాలు ఇస్తున్నారు.

త్రిష ప్రస్తుతం తమిళంలో విజయ్ కి జోడీగా లియో చిత్రంలో నటిస్తుంది. వీళిద్దరిది హిట్ కాంబినేషన్ కావడంతో లియో పై అంచనాలు భారీగా ఉన్నాయి. అలాగే అజిత్ నూతన చిత్రం విడాముయర్చి లోనూ త్రిష నటిస్తోంది. ఇక మణిరత్నం-కమల్ హాసన్ కలయికలో రూపొందుతున్న KH234 లో సైతం ఈ చెన్నై సోయగం హీరోయిన్ గా ఎంపిక అయింది. ఇలా, వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటున్న త్రిష మరో గోల్డెన్ ఆపర్చునిటీని కూడా సొంతం చేసుకుంది.

సన్ పిక్చర్స్ సంస్థ నిర్మాణ సారధ్యంలో ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రంలో కథానాయికగా త్రిష ఎంపిక అయింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో కొడి చిత్రం వచ్చింది. ఇదేకాక గౌరవ్ నారాయణన్ దర్శకత్వంలో ఓ మహిళా ప్రధాన చిత్రంలో కూడా త్రిష నటిస్తోంది. మొత్తానికి, కొన్నేళ్ల క్రితం వరుస ఫ్లాపులతో కెరీర్ ప్రశ్నార్థకంలో పడగా PS2 విజయం త్రిషకు కొత్త ఉత్సాహాన్ని అందించింది. ప్రస్తుతం ఈ అమ్మడు వరుసగా భారీ చిత్రాలను అంగీకరించడాన్ని చూసి అదృష్టం అంటే త్రిషదే అంటున్నారు చెన్నై సినీ జనాలు.

Show Full Article
Print Article
Next Story
More Stories