Tamannah Bhatia : 'ఆహా' లో త‌మ‌న్నా టాక్ షో అప్పుడేనట..

Tamannah Bhatia :  ఆహా లో త‌మ‌న్నా టాక్ షో అప్పుడేనట..
x

 tamannah bhatia

Highlights

Tamannah Bhatia : కరోనా వల్ల నష్టపోయిన రంగాలలో సినిమా ఇండస్ట్రీ కూడా ఉంది.. షూటింగ్ లు లేకపోవడం, ధియేటర్లు కూడా బంద్ అవ్వడంతో

Tamannah Bhatia : కరోనా వల్ల నష్టపోయిన రంగాలలో సినిమా ఇండస్ట్రీ కూడా ఉంది.. షూటింగ్ లు లేకపోవడం, ధియేటర్లు కూడా బంద్ అవ్వడంతో కొన్ని కోట్ల నష్టం అయితే సినిమా ఇండస్ట్రీ చూసింది. ప్రస్తుతం షూటింగ్ లకి అనుమతి లభించింది కానీ ఇంకా ధియేటర్ల పైన పూర్తిగా అయితే క్లారిటీ రాలేదు.. ధియేటర్లు ప్రస్తుతానికి ఓపెన్ గా లేకపోవడంతో విడుదలకి సిద్దంగా ఉన్న సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు మేకర్స్.. ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయి ప్రేక్షకులను అలరించాయి.

ఇక టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అర‌వింద్‌ 'అహా' అనే ఓటీటీని ప్రారంభించిన సంగతి తెలిసిందే.. ఇందులో సినిమాలను మాత్రమే కాకుండా ప్రేక్షకులను మరింతగా ఎంటర్టైన్మెంట్ చేసేందుకు మిల్కీ బ్యూటి తమన్నాతో ఓ టాక్ షో ని ప్లాన్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి.. ఈ షోలో స్టార్ హీరోలు, హీరోయిన్ లను తమన్నా త‌న ప్రశ్నల‌తో షోను మరింతగా రక్తికట్టించనుందట.. అయితే ఈ షో షూటింగ్ వచ్చే నెలలో మొదలుకానుందట.. దసరా నుండి స్పెషల్ గా టెలికాస్ట్ అవుతుందని సమాచారం..

ప్రస్తుతం తమన్నా గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న సీటిమార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో హీరో గోపీచంద్ ఏపీ కబడ్డీ జట్టు కోచ్ గా కనిపించనుండగా, తెలంగాణ కబడ్డీ జట్టు కోచ్ గా తమన్నా కనిపించబోతుంది. సునీల్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. . దాదాపుగా షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..

Show Full Article
Print Article
Next Story
More Stories