ఆహా కోసం వెబ్ సిరీస్ లో తమన్నా!

Tamannaah's 11th Hour : కరోనా వలన సినిమా ధియెటర్లు మూతపడడంతో డిజిటల్ ప్లాట్ ఫామ్ కి మంచి క్రేజ్ ఏర్పడింది.. టెక్నాలజీ విషయంలో ఎప్పుడూ ముందుండే గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఆహ అనే డిజిటల్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ని ముందుకు తీసుకువచ్చారు..

Krishna
Published on: 9 Nov 2020 3:06 PM IST
ఆహా కోసం వెబ్ సిరీస్ లో తమన్నా!
X

Tamannaah's 11th Hour : కరోనా వలన సినిమా ధియెటర్లు మూతపడడంతో డిజిటల్ ప్లాట్ ఫామ్ కి మంచి క్రేజ్ ఏర్పడింది.. టెక్నాలజీ విషయంలో ఎప్పుడూ ముందుండే గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఆహ అనే డిజిటల్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ని ముందుకు తీసుకువచ్చారు.. ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఇప్పటికే చాలా చిత్రాలు రిలీజ్ అయ్యాయి... తాజాగా వచ్చిన కలర్ ఫోటో కూడా మంచి విజయాన్ని అందుకుంది..

ఇక సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ లను, స్పెషల్ షో లను ప్లాన్ చేస్తున్నారు అల్లు అరవింద్.. అందులో భాగంగానే తమన్నా మెయిన్ లీడ్ లో ఇప్పుడొక వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది.. దీనికి ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహిస్తున్నాడు.. ఈ సినిమాకి "లెవెంత్ అవర్" అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన పోస్టర్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.. ఈ పోస్టర్ లో తమన్నా లాంగ్ ఫ్రాక్ తో వెనక్కి తిరిగి చూస్తోంది. ఈ పోస్టర్ కి ప్రేక్షకుల మంచి రెస్పాన్స్ వస్తోంది.. మొత్తం ఎనమిది పార్ట్శ్ గా తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ థ్రిల్లర్ జోనర్ గా వస్తోన్నట్టు సమాచారం. ఈ వెబ్ సిరీస్ ను ఆహా ఓటీటీలో విడుదల చేయనున్నారు.

ఈ సందర్బంగా తమన్నా మాట్లాడుతూ.. కంటెంట్ విషయంలో, టెక్నాలజీ విషయంలో అల్లు అరవింద్ ఎప్పుడు ముందే ఉంటారని చెప్పుకొచ్చింది.. ఇక ఈ వెబ్ సిరిస్ లో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని తమన్నా వెల్లడించింది.. లాక్ డౌన్ సమయంలో తానూ విన్న ఫస్ట్ స్క్రిప్ట్ అని తమన్నా తెలిపింది..ఇక ఇదిలా ఉంటే ఇటివల తమన్నా కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.



Krishna

Krishna

Next Story