ఆ హీరోను కిస్ చేయాలనీ ఉంది : తమన్నా

టీవల అక్కినేని వారి కోడలు సమంత హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఆహా అనే సామ్‌జామ్‌లో పాల్గొంది తమన్నా. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోని బయటకు వదిలారు.

Krishna
Published on: 11 Dec 2020 4:18 PM IST
ఆ హీరోను కిస్ చేయాలనీ ఉంది : తమన్నా
X

ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్ళు అయినప్పటికీ ఇంకా స్టార్ట్ హీరోయిన్ గానే సాగుతుంది మిల్కీ బ్యూటి తమన్నా. 15 ఏళ్ల కెరీర్లో 50 కి పైగా సినిమాలలో నటించింది తమన్నా. ఇటీవల అక్కినేని వారి కోడలు సమంత హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఆహా అనే సామ్‌జామ్‌లో పాల్గొంది తమన్నా. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోని బయటకు వదిలారు. తమన్నాతోపాటు ఆమె స్టంట్స్‌ ట్రైనర్స్‌ కోమల్‌, షాలిని, దర్శకురాలు నందిని రెడ్డి ఎంట్రీ ఇచ్చి అలరించారు.

అయితే ఈ షోలోర్యాపిడ్ ఫైర్ అంటూ సమంత తమన్నాను కొన్ని ఆసక్తికర ప్రశ్నలు అడిగింది. ఒకవేళ నో కిస్సింగ్ ఆన్ స్క్రీన్ బ్రేక్ రూల్ చేస్తే ఎవరితో కిస్ చేయాలనుకుంటున్నావని సమంత ప్రశ్నించగా, విజయ్ దేవరకొండతో కిస్ చెయ్యాలని ఉందని వెంటనే చెప్పేసింది తమన్నా. దీనితో అక్కడ ఉన్న ప్రేక్షకులు గోలగోల చేశారు. గతంలోనూ తమన్నాకి ఇదే ప్రశ్న ఎదురవ్వగా, అయితే అప్పుడు బాలీవుడ్ హీరో హృతిక్‌ రోషన్ పేరు చెప్పింది తమన్నా.

ప్రస్తుతం తమన్నా టాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. సంపత్ నంది దర్శకత్వంలో గోపిచంద్‌ హీరోగా తెరకెక్కతున్న 'సీటీమార్‌' సినిమాలో నటిస్తుంది. అంతేకాకుండా సత్యదేవ్‌తో 'గుర్తుందా శీతాకాలం'లోనూ నటిస్తుంది. ఇక నితిన్ హీరోగా వస్తున్న అందుధాన్ రీమేక్ లో కూడా ఓ కీలక పాత్రలో మేరవనుంది ఈ భామ!

Krishna

Krishna

Next Story