షూటింగ్‌ స్పాట్‌లో రయ్‌ రయ్‌ అంటూ దూసుకెళ్లిన తమన్నా

* బస్సు నడుపుతూ అందరినీ ఆశ్చర్యపర్చిన మిల్కీ బ్యూటీ * సోషల్‌ మీడియాలో వీడియో పోస్ట్ చేయడంతో వైరల్ * గోపీచంద్‌ సరసన సీటీమార్‌ చిత్రంలో నటిస్తున్న భామ

Sandeep Eggoju
Published on: 31 Dec 2020 12:30 PM IST
షూటింగ్‌ స్పాట్‌లో రయ్‌ రయ్‌ అంటూ దూసుకెళ్లిన తమన్నా
X

తన అందంతో.. అభినయంతో అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా. డ్యాన్స్‌తో పాటు డైలాగ్‌ డెలివరీతో కుర్రకారు గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. కరోనా మహమ్మారి నుంచి కోలుకుని ప్రస్తుతం గోపీచంద్‌ సరసన సీటీమార్‌ చిత్రంలో నటిస్తున్న తమ్మన్నా షూటింగ్‌ స్పాట్‌లో పెద్ద సాహసమే చేసింది. బస్సు నడుపుతూ అందరినీ అశ్చర్యపరిచింది. అనంతరం బస్సు నడిపిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు అది కాస్త వైరల్ అయ్యింది. ఇక మిల్కీ బ్యూటీ వీడియోపై విచిత్రమైన కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.



Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story