Taapsee Pannu: స్టార్ హీరోలు తన సినిమాని రిజెక్ట్ చేశారు అంటున్న తాప్సీ

*తాప్సి సినిమాల్ని రిజెక్ట్ చేస్తున్న హీరోలు

admin1
Updated on: 5 Nov 2021 10:01 PM IST
Actress Taapsee Pannu Says Star Heroes Rejected me as Heroine in Some Movies
X

తాప్సి (ట్విట్టర్ ఫోటో)

Taapsee Pannu: టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న తాప్సీ పన్ను ఇప్పుడు బాలీవుడ్ లో కూడా వరుస హిట్ సినిమాలతో ముందుకు దూసుకు వెళుతోంది. పింక్, జుద్వా 2, తప్పడ్ వంటి సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షించిన తాప్సీ పన్ను ఈ మధ్యనే విడుదలైన రష్మీ రాకెట్ సినిమాతో కూడా మంచి విజయాన్ని సాధించింది. ఎఫ్ ఐ సి సి ఐ గ్లోబల్ యంగ్ లీడర్స్ సమ్మిట్ లో పాల్గొన్న తాప్సీ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. చాలామంది స్టార్ హీరోలు సైతం ఆమెతో నటించేందుకు ఆసక్తి చూపించలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది తాప్సీ.

స్టార్ హీరోల నుంచి కొత్త హీరోల వరకూ చాలామంది నటులు ఈమెతో సినిమా చేసేందుకు అంగీకరించేవారు కాదట. తాజాగా తాప్సీ పన్ను డబుల్ రోల్ చేస్తున్న సినిమాలో హీరో కోసం ప్రయత్నిస్తే ఒక హీరో ఒక తాప్సీని భరించటం కష్టం అంటే ఇక్కడ ఇద్దరు అని అంటూ సినిమాను రిజెక్ట్ చేశారట. ఆఖరికి గతంలో ఈమె తో కలిసి నటించిన ఒక హీరో కూడా ఇప్పుడు మళ్ళీ ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఇష్టపడలేదట. "అది ఒక ప్రేమ కథ. ఆయన నా కంటే ఇంకా పెద్ద సినిమాలు తీశారు. ఆయన చాలా పెద్ద స్టార్ కూడా" అంటూ షాక్ ఇచ్చింది. కేవలం ఒకటి అర సినిమాలు చేసిన హీరోలు మాత్రమే ఇప్పుడు తాప్సీతో సినిమాలు చేసేందుకు ముందుకు వస్తున్నారట.

admin1

admin1

Next Story