Surekha Vani: ఆ హీరో అంటే ఇష్టం.. వంద ముద్దులిస్తా

Surekha Vani: తెలుగు సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సురేఖావాణి తెలియ‌నివారు ఉండ‌రు.

Samba Siva Rao
Published on: 13 May 2021 5:52 PM IST
surekha vani Want kiss To Chiranjeevi
X

సురేఖావాణి ఫైల్ ఇమేజ్ 

Surekha Vani: తెలుగు సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సురేఖావాణి తెలియ‌నివారు ఉండ‌రు. ఆమె అంద‌రి హీరోహీరోయిన్ల‌కు అక్కగా, వదినగా, అత్తగా ఇలా ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించింది. సోషల్ మీడియాలో అయితే ఆమెకి క్రేజ్ మాత్రం మాములుగా లేదు. ఆమె ఫాలోయింగ్ చూస్తే టాప్ హీరోయిన్లకు మించి ఉంటుంది. అందంతో పాటు ఆకట్టుకునే నటనతో టాలీవుడ్‌లో తనదైన ముద్రవేసుకుంది. ఇటీవలి కాలంలో సినిమాల్లో కనిపించడం తగ్గించినప్పటికీ సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తుంది. ఇక తాజాగా సురేఖావాణి ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న ఆమె ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

సురేఖా వాణి వ్యాఖ్య‌లు సోషల్‌ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. సురేఖావాణి భర్త మరణించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆమె త‌న కూతురు సుప్రీత‌తో క‌లిసి ఉంటున్నారు. అయితే షోలో మాట్లాడిన‌ ఆమె భ‌ర్త మ‌ర‌ణం తర్వాత అత్తింటి వేధింపులు తట్టుకోలేక బయటకు వచ్చానంటూ కన్నీటి పర్యాంతమయ్యారు. షూటింగ్‌ టైమ్‌లో సెట్‌లో సరదా ముచ్చట్లను ఆమె పంచుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవికి అంటే త‌న‌కి ఇష్ట‌మ‌ని.. చిరంజీవికి తానొక పెద్ద అభిమానిననీ చెప్పుకొచ్చారు., ఆయన్ను చూసిన ప్రతిసారి కళ్లల్లో నీళ్లు తిరుగుతాయని చెప్పింది. స్టాలిన్‌ సినిమా సమయంలో షూటింగ్‌లో ఆయన్ను చూసి ఏడుస్తుంటే ఓదార్చారని, ఇంటికి భోజనానికి ఆహ్వానించారని ఆమె తెలిపారు.

అయితే పవన్‌ కల్యాణ్‌ విషయంలో ఓ ఆసక్తికర విష‌యాలు చెప్పారు. మన హీరోల్లో ముద్దు పెట్టాల్సి వస్తే ఎవరికి పెడతారు అన్న యాంకర్‌ ప్రశ్నకు సురేఖ వాణి పవన్‌కల్యాణ్‌కు వంద ముద్దులు పెడతానని బదులిచ్చారు. ఆయనంటే గౌరవమని చెప్పారు. సురేఖ కూతురు సుప్రిత‌కు న‌ట‌న‌ పట్ల ఆసక్తి ఉందనీ, ప్రస్తుతం నటనలో శిక్షణ తీసుకుంటుందని చెప్పారు.

సురేఖ రియల్‌ లైఫ్‌లో ట్రెడిషినల్‌ లుక్‌లోనే కనిపిస్తుంటారు. ఇటీవ‌ల‌ 40వ పుట్టిన రోజు పొట్టి దుస్తుల్లో ఉన్న వీరిద్దరి ఫోటోలు వైరల్‌ అయి, చివరకు ట్రోల్‌ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇటీవలే సురేఖ బర్త్‌డేకి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story