Surekha Vani: బిగ్‌బాస్ పుకార్ల పై క్లారిటీ ఇచ్చిన సురేఖ వాణి కూతురు

Surekha Vani: మా అమ్మ బిగ్ బాస్ కు వెళ్ళటం లేదు," అంటున్న సుప్రీత

admin1
Published on: 13 Aug 2021 8:04 PM IST
Actress Surekha Vani Daughter Gives a Clarity on Bigg Boss Rumors
X

సురేఖావాణి బిగ్ బాస్ పై క్లారిటీ ఇచ్చిన తన కూతురు (ఫైల్ ఇమేజ్)

Surekha Vani: తెలుగు లో అతిపెద్ద రియాలిటీ షో ఆయన బిగ్బాస్ సీజన్ 5 ఇప్పుడు త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 3 మరియు 4 వ సీజన్లకు హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున ఈ సీజన్ కి కూడా హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఇక ఈ సీజన్ కు కంటెస్టెంట్స్ గా ఎవరు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవనున్నారు అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే చాలా మంది పేర్లు బయటకు వచ్చాయి కానీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా బయటకు రాలేదు. తాజాగా నటి సురేఖ వాణి బిగ్బాస్ సీజన్ 5 లో కనిపించనుందని పుకార్లు పుట్టుకొచ్చాయి.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ వెంటనే డిలీట్ చేసేయడంతో ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి. తాజాగా సురేఖ వాణి కూతురైన సుప్రీత తన సోషల్ మీడియా నుంచి ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. సురేఖ వాణి బిగ్ బాస్ సీజన్ 5 కి వెళ్లడంలేదని, అసలు ఆమెకు ఆ కాన్సెప్ట్ అంతగా నచ్చదని చెప్పుకొచ్చింది సుప్రీత. ఇక మరోవైపు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తాజాగా క్వారాంటీన్ కి వెళ్ళారు. సీజన్ 5 సెప్టెంబర్ ఐదో తారీకు నుంచి మొదలు కాబోతోంది.

admin1

admin1

Next Story