Surekha Vani: మరోసారి కూతురుతో కలిసి రచ్చ రచ్చ చేసిన సురేఖ వాణి

Sandeep Eggoju
Published on: 29 April 2021 1:04 PM IST
Surekha Vani: మరోసారి కూతురుతో కలిసి రచ్చ రచ్చ చేసిన సురేఖ వాణి
X

సురేఖ వాణి బర్త్ డే వేడుకలు (ఫైల్ ఇమేజ్)

Surekha Vani: తెలుగులో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సురేఖ వాణి అక్కగా, వదినగా, అత్తగా ఇలా ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించింది. సోషల్ మీడియాలో ఆమెకి క్రేజ్ మాత్రం మాములుగా లేదు. ఆమె ఫాలోయింగ్ చూస్తే టాప్ హీరోయిన్లకు మించి ఉంటుంది. అందంతో పాటు ఆకట్టుకునే నటనతో టాలీవుడ్‌లో తనదైన ముద్రవేసుకుంది. ఇటీవలి కాలంలో సినిమాల్లో కనిపించడం తగ్గించినప్పటికీ సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తుంది. ఇక తాజాగా సురేఖ వాణి తన కూతురు సుప్రీత ఇద్దరూ కలిసి చేసే హంగామా అంతా ఇంతా కాదు.

ఇక మరోసారి సురేఖ వాణి సోషల్‌ మీడియాలో సందడి చేసింది. రియల్‌ లైఫ్‌లో ట్రెడిషినల్‌ లుక్‌లోనే కనిపిస్తుంటారు. పొట్టి దుస్తుల్లో ఉన్న వీరిద్దరి ఫోటోలు వైరల్‌ అయి, చివరకు ట్రోల్‌ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సురేఖ బర్త్‌డేకి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

గురువారం సురేఖవాణి 40వ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం రాత్రి వేడుకలు జరుపుకుంది. ఈ వేడుకలకు సురేఖ కూతురు సుప్రిత, అత్యంత సన్నిహితులు హాజరైయ్యారు. ఈ వేడుకలను ఆమె సుప్రీత దగ్గరుండి చేసుకుంది. తన పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసినందుకు సుప్రితకు ధన్యవాదాలు చెప్పింది సురేఖ.

'నా జీవితంలో నిన్ను మించిన ఆస్తి, ఆనందం ఇంకోటి లేదు.నా బలం, బలహీనత అన్ని నువ్వే'అని కామెంట్ చేసింది. ప్రస్తుతం సురేఖవాణికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story