Sobhita: పిల్లల గురించి శోభిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌.. తనకు మాతృత్వం ఇష్టమంటూ..

Sobhita Dhulipala: ఇక ఎంగెజ్‌మెంట్ తర్వాత పెళ్లికి గ్యాప్ తీసుకున్న ఈ జంట ప్రస్తుతం తమ సినిమాల్లో బిజీగా ఉన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 27 Sept 2024 7:18 PM IST
Actress sobhita dhulipala interesting comment about her marriage and personal life
X

Sobhita: పిల్లల గురించి శోభిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌.. తనకు మాతృత్వం ఇష్టమంటూ.. 

అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల త్వరలోనే మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుతున్న విషయం తెలిసిందే. కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్న ఈ జంట ఇటీవల కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని కింగ్ నాగార్జున తానే స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

ఇక ఎంగెజ్‌మెంట్ తర్వాత పెళ్లికి గ్యాప్ తీసుకున్న ఈ జంట ప్రస్తుతం తమ సినిమాల్లో బిజీగా ఉన్నారు. అటు చై, ఇటు శోభిత ఇద్దరూ లైన్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇక ఈ జంట వివాహాన్ని లండన్‌లో చేసుకోనుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు లాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఇదిలా ఉంటే నిశ్చితార్థం తర్వాత శోభిత తాజాగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన పెళ్లిలో కచ్చితంగా తెలుగు సంప్రదాయలను పాటించాలని ఉందని తెలిపింది. చైతూతో తన ఎంగేజ్మెంట్ ఎలా జరగాలని అనుకున్నానో అలాగే జరిగిందని.. కానీ అది సింపుల్ గా లేదా గ్రాండ్ గా జరిగిందా అనే విషయాన్ని తాను పెద్దగా పట్టించుకోలేదని చెప్పుకొచ్చింది. ఇక తనకు మాతృత్వం అంటే చాలా ఇష్టమని శోభిత తెలిపింది.

ఎప్పుడూ పెళ్లి చేసుకుని .. పిల్లలకు జన్మనిచ్చినట్లుగా ఊహించుకునేదానని తెలిపింది. ఇక తన పెళ్లి వేడుకలో మాత్రం కచ్చితంగా తెలుగు సంప్రదాయలను పాటిస్తానని తెలిపింది. ఇక పెళ్లిలో అమ్మాయిలు కట్టుకునే ఎర్రటి అంచు ఉండే తెలుపు రంగు పట్టు చీర కట్టుకుంటానని తన మనసులో మాటను బయట పెట్టిందీ బ్యూటీ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story