Sneha: నటి స్నేహకి బెదిరింపులు.. చెన్నై పోలీసులకి ఫిర్యాదు

* అప్పుగా తీసుకున్న తమ డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని అడిగితె బెదిరింపులకు పాల్పడుతున్నారని పోలీసులకు నటి స్నేహ ఫిర్యాదు

Sandeep Reddy
Published on: 18 Nov 2021 6:25 PM IST
Actress Sneha Filed Police Complaint Against Two Business Man About Finacial Issues
X

Sneha: నటి స్నేహకి బెదిరింపులు.. చెన్నై పోలీసులకి ఫిర్యాదు

Actress Sneha: తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్నేహ తాజాగా చెన్నైలోని కానత్తుర్ పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించింది. చెన్నైకి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు తమ వద్ద డబ్బు అప్పుగా తీసుకొని ఇవ్వడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి వ్యాపారం నిమిత్తం తన వద్ద 26 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారని తిరిగి ఇవ్వమని అడిగితే డబ్బు ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె చెప్పుకొచ్చింది.

తన వద్ద డబ్బు తీసుకొని మోసం చేశారని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని నటి స్నేహ ఫిర్యాదు చేసింది. స్నేహ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. ఇక దర్శకుడు ప్రసన్నకుమార్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న స్నేహ.. ప్రస్తుతం అటు తెలుగు, తమిళ చిత్రాల్లో సహానటిగా నటిస్తుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story