Shriya Saran Gamanam First Look : శ్రియ 'గ‌మ‌నం' ఫ‌స్ట్ లుక్ రిలీజ్!

Shriya Saran Gamanam First Look : అందం, అభినయంతో ఆకట్టుకోగల నటి శ్రియ శరన్.. దాదాపుగా రెండు దశాబ్దాల పాటు ప్రేక్షకులను .

Krishna
Published on: 11 Sept 2020 12:33 PM IST
Shriya Saran Gamanam First Look : శ్రియ గ‌మ‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్!
X

Shriya Saran Gamanam First Look

Sriya Gamanam First Look : అందం, అభినయంతో ఆకట్టుకోగల నటి శ్రియ శ‌ర‌ణ్‌.. దాదాపుగా రెండు దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించించింది. పెళ్లి తర్వాత సినిమాలకి కాస్తా బ్రేక్ ఇచ్చిన శ్రియ మళ్ళీ కెమరా ముందుకు వచ్చింది. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె లేటెస్ట్ మూవీ గగనం నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.. ఈ ఫస్ట్ లుక్ ని దర్శకుడు క్రిష్ రిలీజ్ చేశారు. ఇందులో శ్రియ చీర క‌ట్టుకొని, మెడ‌లో మంగ‌ళ‌సూత్రం వేసుకొని ఓ సాధారణ గృహిణి లాగా కనిపిస్తుంది చూస్తుంటే శ్రియ ఓ విభిన్నమైన పాత్రను పోషిస్తున్నట్టుగా తెలుస్తోంది.

సుజ‌నా రావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని లుగు, త‌మిళ‌, క‌న్నడ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి మాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతం అందిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నాడు. ర‌మేష్ క‌రుటూరి, వెంకీ పుష‌డ‌పు, జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్‌. నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. ఇందులో శ్రియతో పాటుగా శివ కందుకూరి, నిత్యామీనన్‌, ప్రియాంక జువాల్కర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇక శ్రియ 1982, సెప్టెంబర్‌ 11న డెహ్రాడూన్‌లో జన్మించింది. మోడల్ నుంచి నటిగా మారింది. ఇష్టం సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయిన శ్రియ.. ఆ తర్వాత సంతోషం, చెన్నకేశవరెడ్డి, నువ్వే నువ్వే, ఠాగూర్‌ మొదలగు చిత్రాలలో నటించింది. ప్రస్తుతం RRRలో గెస్ట్ రోల్ చేస్తోంది. దీంతోపాటు `సండక్కరి` చిత్రంలో నటిస్తుంది శ్రియ.



Krishna

Krishna

Next Story