Samantha: తన అనారోగ్యంపై సినీ నటి సమంత ప్రకటన

Samantha: మయోసైటిస్‌ వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించిన సమంత

Rama Rao
Published on: 29 Oct 2022 4:59 PM IST
Actress Samantha Statement on Her Health | Telugu Movie News
X

Samantha: తన అనారోగ్యంపై సినీ నటి సమంత ప్రకటన

Samantha: తన అనారోగ్యంపై సినీ నటి సమంత ట్వీట్ చేశారు. సమంత అనారోగ్యంతో బాధపడుతున్నారని, వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారని, గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై సమంత స్పందించారు. తాను నటించిన యశోద సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా డబ్బింగ్‌ చెబుతున్న ఫొటోను షేర్‌ చేస్తూ పోస్ట్‌ చేశారు.

ఆ ఫొటోలో సమంత చేతికి సెలైన్‌ ఉండటం గమనార్హం. గత కొన్ని నెలల నుంచి మయోసైటిస్‌ అనే ఆటో ఇమ్యూనిటీ కండిషన్‌కు చికిత్స తీసుకుంటున్నానని ఇప్పుడు తన ఆరోగ్యం నిలకడగా ఉందని సమంత తెలిపారు. ప్రతిదీ స్వీకరిస్తూనే నా పోరాటం కొనసాగిస్తానని త్వరలోనే దీని నుంచి పూర్తిగా కోలుకుంటానని వైద్యులు నమ్మకంతో ఉన్నారని ట్వీట్ చేశారు.


Rama Rao

Rama Rao

Next Story