Samantha Tweet: నెటిజన్ నోరు మూయించిన సమంత

*ట్రోల్స్ కి రిప్లై ఇచ్చి షాక్ ఇచ్చిన సమంత

admin1
Published on: 22 Dec 2021 1:22 PM IST
Actress Samantha Shut Down Trolls with a Simple Tweet
X

నెటిజన్ నోరు మూయించిన సమంత

Samantha: టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత మరియు నాగ చైతన్య విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇకపై తాము భార్య భర్తల లాగా కొనసాగలేమని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశారు. అయితే వీరు విడాకులకు కారణం ఏంటని చెప్పకపోయినప్పటికీ కొందరు మాత్రం సమంత దే తప్పు అంటూ ముద్ర వేసేశారు. నిజానికి విడాకుల విషయంలో అభిమానులు ఇద్దరిపై దుమ్మెత్తిపోశారు కానీ సమంతా పై మాత్రం చాలామంది కన్నెర్ర చేశారు. ఆమె ప్రవర్తన వల్లే వారు ఇద్దరూ విడాకులు తీసుకున్నారు అని బోలెడు పుకార్లు బయటకు వచ్చాయి.

కానీ సమంత మాత్రం ఎప్పుడూ ఈ పుకార్లపై రియాక్ట్ అవలేదు. ఇక తాజాగా సమంత అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప" సినిమాలో "ఊ అంటావా" అనే ఐటమ్ సాంగ్లో కనిపించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆమె ఎక్స్పోజింగ్ పై అభిమానులు తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ చేశారు. తాజాగా అదే పాట మ్యూజిక్ తో ఒక్కరూ ట్విట్టర్లో ఒక పేరడీ సాంగ్ ని క్రియేట్ చేశారు. ఆ వీడియో కింద ఒకరు సమంతని తిట్టడం మొదలు పెట్టాడు. ఎప్పుడూ లేని విధంగా సమంత ఆ ట్రోల్స్ కి రిప్లై ఇచ్చింది. "గాడ్ బ్లెస్ యూ" అని అతని పేరు టాగ్ చేసింది.

admin1

admin1

Next Story