సినిమా చూస్తూ కన్నీటి పర్యంతం అయిన సదా.. వైర‌ల్ అవుతున్న వీడియో!

Actress Sadha Cries: ‘జయం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన హీరోయిన్ సదా.

Arun Chilukuri
Published on: 19 Jun 2022 5:02 PM IST
Actress Sadha Cried in Theater While Watching Major Movie
X

సినిమా చూస్తూ కన్నీటి పర్యంతం అయిన సదా.. వైర‌ల్ అవుతున్న వీడియో!

Actress Sadha Cries: 'జయం' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన హీరోయిన్ సదా. సదా టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తరువాత మంచి క్రేజ్ సంపాదించారు. తర్వాత తమిళం సహా దక్షిణాది భాషల్లో మరికొన్ని సినిమాల్లో కూడా నటించారు. గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సదా యూట్యూబ్‌, సోషల్ మీడియా, పలు టీవీ షోలలో కనిపిస్తూ ప్రేక్షకులకి టచ్ లోనే ఉంది.

తాజాగా సదా మేజర్ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకుంది. సినిమా అయ్యాక మీడియాతో మాట్లాడింది. ఉగ్రదాడి జరిగిన సమయంలో తాను ముంబయిలోనే ఉన్నానని.. ఇప్పుడు ఈ సినిమా చూస్తుంటే ఆనాటి రోజులు గుర్తుకువచ్చాయని, కొన్ని సన్నివేశాల్లో రోమాలు నిక్కబొడుచుకున్నాయని అన్నారు. శశికిరణ్‌ కథను నడిపించిన విధానం, అడివి శేష్‌ నటన అద్భుతంగా ఉన్నాయని ఆమె కొనియాడారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story