Renu Desai: ఈ తల్లి శాపం మీకు కచ్చితంగా తగులుతుంది.. రేణు ఆగ్రహం

Actress renu desai sensational comments about trolling her on social media
x

Renu Desai: ఈ తల్లి శాపం మీకు కచ్చితంగా తగులుతుంది.. రేణు ఆగ్రహం

Highlights

Renu Desai: అయితే తాజాగా మరోసారి రేణుదేశాయ్‌ ఇలాంటి నెగిటివ్‌ కామెంట్స్‌పై తీవ్రంగా స్పందించారు. తాజాగా పవన్‌ కళ్యాణ్‌ తన సతీమణి అనా లెజినొవా, పిల్లలు అకీరా నందన్‌ , ఆద్యలతో సరదాగా దిగిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే.

Renu Desai: నటి రేణు దేశాయ్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే. అయితే పలు సందర్భాల్లో రేణు దేశాయ్‌ ట్రోలింగ్‌ను సైతం ఎదుర్కోవాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్‌ ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించడం, ఏపీ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రేణు దేశాయ్‌ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నారు. ఇటీవల ఓ అభిమాని రేణు దేశాయ్‌ని ఉద్దేశిస్తూ.. మీరు దురదృష్టవంతులు అంటూ కామెంట్ చేయగా. దీనిపై రేణు దేశాయ్‌ ఓ రకంగా ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే తాజాగా మరోసారి రేణుదేశాయ్‌ ఇలాంటి నెగిటివ్‌ కామెంట్స్‌పై తీవ్రంగా స్పందించారు. తాజాగా పవన్‌ కళ్యాణ్‌ తన సతీమణి అనా లెజినొవా, పిల్లలు అకీరా నందన్‌ , ఆద్యలతో సరదాగా దిగిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫొటోను ఉపయోగించే కొందరు అత్యుత్సాహం ప్రదర్శించారు. మీమ్స్‌ను తయారు చేసి రేణు దేశాయ్‌ను అవనమానపరిచేలా కామెంట్స్‌ చేశారు. దీందో ఈ వారిపై రేణు దేశాయ్‌ ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పవన్‌, అనా లెజినొవాతో పాటు తన పిల్లలు దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ సుదీర్ఘ పోస్ట్‌ను రాసుకొచ్చారు.

ఈ ఫొటోతో పాటు.. 'ఆ ఫొటోను నేను ఏ విధంగా క్రాప్‌ చేస్తానని, ఎలా పోస్టు చేస్తానని మీమ్స్‌, జోక్‌లు పేల్చే భయంకరమైన వ్యక్తులూ.. మీకూ ఒక కుటుంబం ఉందని గుర్తుంచుకోండి. తల్లిని ఎగతాళి చేసేలా ఉన్న పోస్ట్‌ను చూసి నా కుమార్తె ఏడ్చింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులను ఎగతాళి చేసే మీకూ ఇంట్లో తల్లి, అక్కాచెల్లెళ్లు, కూతుర్లు ఉంటారని గుర్తుంచుకోండి' అంటూ ఘాటుగా స్పందించారు.

'ఈ రోజు నా కుమార్తె ఎంతో బాధ అనుభవించింది. ఆమె కన్నీళ్లు కర్మ రూపంలో మిమ్మల్ని వెంటాడతాయని గుర్తుంచుకోండి. పొలినా, మార్క్‌ (పవన్‌-అనా లజినొవాల సంతానం) సైతం ఇలాంటి విచక్షణ లేని కామెంట్లు, మీమ్స్‌తో ప్రభావితం అవుతారు. ఇలాంటి మీమ్‌ పేజీలను నిర్వహించేవారు సమాజంలో అత్యంత భయంకరమైన వ్యక్తులు. ఈ తల్లి శాపం మీకు కచ్చితంగా తగులుతుంది. ఈ పోస్టు చేయడానికి ముందు వంద సార్లు ఆలోచించాను. అయితే నా కుమార్తె కోసం, ఆమె అనుభవించిన బాధను దృష్టిలో ఉంచుకొని పోస్టు చేశాను’’ అని రేణు దేశాయ్‌ పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories