Tollywood: అందాల రవళి ఇప్పుడెలా మారిందో చూశారా.? షాక్‌ అవ్వాల్సిందే..?

Actress Ravali: ఇండస్ట్రీలో హీరోలు ఉన్నంత కాలం హీరోయిన్లు హవాను కొనసాగించలేరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 Nov 2024 10:30 AM IST
Actress ravalis Latest Photos Goes Viral on Social Media
X

Tollywood: అందాల రవళి ఇప్పుడెలా మారిందో చూశారా.? షాక్‌ అవ్వాల్సిందే..? 

Actress Ravali: ఇండస్ట్రీలో హీరోలు ఉన్నంత కాలం హీరోయిన్లు హవాను కొనసాగించలేరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్లు సైతం కొన్ని ఫ్లాపులు ఎదురైతే తెర కనుమరుగవుతుంటారు. ఒకప్పుడు కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన హీరోయిన్లు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత అలనాటి అందాల తారలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

హీరోయిన్‌ రవళి గురించి అలనాటి సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన అందం, అభినయంతో అప్పట్లో ఎంతో పాపులారిటీని సంపాదించుకున్నారు. తెలుగు తమిళ్ కన్నడ భాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పింది. ముఖ్యంగా శుభాకాంక్షలు, పెళ్లి సందడి సినిమాలు తెలుగులో రవళికి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.

అయితే హీరోయిన్‌గా సినిమా అవకాశాలు వస్తున్న తరుణంలోనే రవళి వివాహం చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. 2007లో నీలి కృష్ణ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం భర్త, పిల్లలతో సరాదాగా గడుపుడుతోంది. ఇక సీరియల్స్‌లో కూడా నటించకుండా తెరకు పూర్తిగా దూరమైంది. కాగా ఇటీవల రవళి తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఆ సమయంలో ఆమె కెమెరా కంటికి చిక్కారు. దీంతో రవళి ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అయ్యాయి. అయితే రవళి పూర్తి మారిపోయింది. గుర్తు పట్టలేనంతలా మారిన రవళిని చూసిన అభిమానులు ఒకింత షాక్‌ అయ్యారు. ఇండస్ట్రీకి దూరమైన తర్వాత కూడా మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన ఎంతో మంది తారలు ఉన్నారు. మరి రవళి కూడా ఏదో ఒక సమయంలో మళ్లీ ప్రేక్షకులను పలకరిస్తుందో చూడాలి.



హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story