సక్సెస్‌ కోసం ఆ విషయంలో రాజీపడక తప్పలేదంటున్న రష్మిక మందన

Rashmika Mandanna about her personal life
x

సక్సెస్‌ కోసం ఆ విషయంలో రాజీపడక తప్పలేదంటున్న రష్మిక మందన

Highlights

Rashmika Mandanna about her personal life: రష్మిక మందన.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నేషనల్ క్రష్‌గా పేరు సంపాదించుకుందీ బ్యూటీ. కన్నడ...

Rashmika Mandanna about her personal life: రష్మిక మందన.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నేషనల్ క్రష్‌గా పేరు సంపాదించుకుందీ బ్యూటీ. కన్నడ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన రష్మిక తెలుగులో ఎన్నో విజయాలను అందుకుంది. యానిమల్‌, పుష్ప 1 పుష్ప 2 వంటి చిత్రాలతో నేషనల్ లెవల్‌లో క్రేజ్‌ను దక్కించుకుందీ చిన్నది. కాగా కెరీర్‌లో ఉన్నత స్థానానికి చేరుకున్న రష్మిక.. ఇందుకు తాను ఓ విషయంలో రాజీ పడ్డానని చెప్పుకొచ్చింది.

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వివరాలను పంచుకుంది. సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల కుటుంబానికి సమయాన్ని కేటాయించలేకపోతున్నానని చెప్పుకొచ్చిన రష్మిక.. తన కెరీర్‌ విషయంలో కుటుంబసభ్యులు సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. సక్సెస్‌ కోసం ఎంతో శ్రమించాలని.. ఆ సమయంలో కొన్ని విషయాల్లో రాజీ పడాల్సి ఉంటుందని చెప్పుకొచ్చింది.

ఇదే విషయమై ఆమె మాట్లాడుతూ.. 'కెరీర్‌ పరంగా బిజీగా ఉండడం వల్ల కుటుంబంతో వీలైనంత ఎక్కువ సమయం గడపలేకపోతున్నా. ఈ ప్రయాణంలో నేను రాజీపడిన అతిపెద్ద విషయం ఇదే. వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలకు ఒకేసారి సమయాన్ని కేటాయించడం అంత సులభం కాదు. ఒకదాని కోసం మరొకటి త్యాగం చేయాల్సి ఉంటుంది' అని చెప్పుకొచ్చింది.

ఈ విషయాన్ని కెరీర్ ప్రారంభంలోనే తన తల్లి చెప్పినట్లు రష్మిక గుర్తు చేసుకుంది. కెరీర్‌ పరంగా ఉండే కమిట్‌మెంట్స్‌ నిలబెట్టుకోవాలంటే ఫ్యామిలీ టైమ్‌ త్యాగం చేయాల్సిందే అని తెలిపింది. ఇక తన బలం కుటుంబమేనన్న రష్మిక, కీలక సమయాలను ఫ్యామిలీతోనే గడపడానికి ఇష్టపడుతానని చెప్పుకొచ్చింది. చెల్లి అంటే ఎంతో ఇష్టమన్న బ్యూటీ.. ప్రతిరోజూ మెసేజ్‌లు చేసుకుంటామని తెలిపింది. అయితే వరుస షూటింగ్స్‌ వల్ల తనతో గడిపే సమయాన్ని ఎంతగానో మిస్‌ అవుతున్నానని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories