మహేష్ బాబుపై మనసు పారేసుకున్న రాశి ఖన్నా..

Actress Rashi Khanna About Superstar Mahesh Babu
x

మహేష్ బాబుపై మనసు పారేసుకున్న రాశి ఖన్నా..

Highlights

Rashi khanna:"ఊహలు గుసగుసలాడే" సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన హీరోయిన్ రాశి ఖన్నా...

Rashi khanna: "ఊహలు గుసగుసలాడే" సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన హీరోయిన్ రాశి ఖన్నా ఇప్పటికే తన కెరియర్లో కొన్ని మంచి హిట్ సినిమాలను నమోదు చేసుకుంది. తాజాగా ఇప్పుడు గోపీచంద్ హీరోగా నటిస్తున్న "పక్కా కమర్షియల్" సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్న రాశిఖన్నా కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది.

తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి చెప్పిన రాశి ఖన్నా టాలీవుడ్ లో ఏ హీరో తో సినిమా చేయాలని అనుకుంటున్నారు అని అడగగా వెంటనే మహేష్ బాబు అని చెప్పింది. తనకి మహేష్ బాబు అంటే చాలా ఇష్టం అని ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది రాశి ఖన్నా. మహేష్ బాబు తో సినిమా చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు చెబుతోంది రాశి.

మరి సూపర్ స్టార్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం ఈ "తొలిప్రేమ" బ్యూటీకి దొరుకుతుందో లేదో వేచి చూడాలి. మరోవైపు మారుతి దర్శకత్వం వహిస్తున్న "పక్కా కమర్షియల్" సినిమా జూలై 1న థియేటర్లలో విడుదల కాబోతోంది. యు.వి.క్రియేషన్స్ మరియు గీత ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి జేక్స్ బిజాయ్ సంగీతాన్ని అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories