Ramya Krishnan: మహిళపై ఇంత నీచంగా మాట్లాడతారా?

Ramya Krishnan: మంత్రి రోజాకు మద్దతుగా వీడియో విడుదల చేసిన రమ్యకృష్ణ

Jyothi
Updated on: 8 Oct 2023 7:17 AM IST
Actress Ramya Krishnan Slams Bandaru Satyanarayana
X

Ramya Krishnan: మహిళపై ఇంత నీచంగా మాట్లాడతారా?

Ramya Krishnan: మంత్రి రోజా పై టీడీపీ నేత బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల పై సినీ నటి రమ్య కృష్ణ స్పందించారు. రోజాకు మద్దతు ప్రకటించిన రమ్యకృష్ణ టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ….రోజా పై చేసిన అసభ్య వ్యాఖ్యలు కు తీవ్ర ఆవేదన కలిగించాయని అన్నారు. ఇవి రోజాను మాత్రమే కాదు ఆమె కుటుంబాన్ని కూడా టార్గెట్ చేయటమే అని పేర్కొన్న ఆమె అందరు మహిళలపై జరుగుతున్న శారీరక, మానసిక హింసను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.

ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ఈ ఘటన పై స్పందించాలని పేర్కొన్న బండారు సత్యనారాయణ పై తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. మన దేశంలో మాత్రమే భారత మాతకీ జై అని గర్వంగా చెప్తామని.. అలాంటి దేశంలో ఓ మహిళపై ఇంత నీచంగా మాట్లాడతారా అంటూ ఆమె కామెంట్ చేశారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, జెండర్‌తో సంబంధం లేకుండా బండారు సత్యనారాయణ మూర్తి వ్యాఖ్యలు ఖండించాలని, తాను మహిళగా, నటిగా, స్నేహితురాలిగా మంత్రి రోజాకి అండగా ఉంటానని అన్నారు. బండారు చేసిన వ్యాఖ్యల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


Jyothi

Jyothi

Next Story