రమ్యకృష్ణ కారులో భారీగా ప‌ట్టుబ‌డ్డ మ‌ద్యం.. కారు డ్రైవర్ అరెస్ట్..

రమ్యకృష్ణ కారులో భారీగా ప‌ట్టుబ‌డ్డ మ‌ద్యం.. కారు డ్రైవర్ అరెస్ట్..
x
Highlights

ప్ర‌ముఖ సినీ న‌టి రమ్యకృష్ణ కారులో భారీగా మద్యం ప‌ట్టుబ‌డింది. రమ్యకృష్ణ కారు డ్రైవర్ సెల్వకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలో ఈయన...

ప్ర‌ముఖ సినీ న‌టి రమ్యకృష్ణ కారులో భారీగా మద్యం ప‌ట్టుబ‌డింది. రమ్యకృష్ణ కారు డ్రైవర్ సెల్వకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలో ఈయన అక్రమంగా మద్యం తరలిస్తూ పోలీసులకు దొరికిపోయాడు. చెన్నైలోని ఈసీఆర్ రోడ్డులో కానత్తూర్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు. ఈ సమయంలో అటుగా వచ్చిన రమ్యకృష్ణకు చెందిన టయోటా ఇన్నోవా క్రిస్టా కారు (టీఎన్07క్యూ0099)ను నిలిపివేసిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

ఈ సోదాల్లో భారీగా మద్యం వెలుగు చూసింది. సుమారు 96 బీర్ బాటిల్స్, 8 లిక్కర్ సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారు డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. చెన్నైలో మద్యం లభించపోవడంతో మహాబలిపురం నుండి మద్యం తెస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. దీనిపై రమ్యకృష్ణ ఇంకా స్పందించలేదు. దీనిపై కనత్తూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాగా, రమ్యకృష్ణ కారు డ్రైవర్ బెయిల్ పై బయటికి వచ్చినట్టు సమాచారం.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories