Rakul Preet Singh: పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన రకుల్ ప్రీత్

*జాకీతో పెళ్లి పై ఓపెన్ కామెంట్స్ చేసిన రకుల్

admin1
Published on: 21 Dec 2021 8:25 AM IST
Actress Rakul Preet Singh gave Clarity about her Marriage with Jackky Bhagnani
X

జాకీతో పెళ్లి పై ఓపెన్ కామెంట్స్ చేసిన రకుల్

Rakul Preet Singh: ఈమధ్యనే స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా రివీల్ చేసిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న వీరిద్దరూ ఇప్పుడు పెళ్లికి సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా రకుల్ ప్రీత్ బాలీవుడ్ నిర్మాత మరియు నటుడు అయిన జాకీ ను ప్రేమిస్తున్నట్లు గా ఇన్స్టా వేదికగా తెలియజేసింది. అప్పటి నుంచి వీరిద్దరి పెళ్లి గురించి బోలెడు పుకార్లు బయటకు వస్తున్నాయి. తాజాగా పెళ్లి విషయంలో క్లారిటీ ఇచ్చింది రకుల్ ప్రీత్.

రకుల్ "ఛత్రీవాలా" షూటింగ్ కొరకు లక్నో వెళ్లారు. 40 రోజులకు పైగా ఛత్రీవాలా సినిమా షూటింగ్ లక్నోలో జరిగింది. "ఇన్నిరోజులు లక్నోలో షూటింగ్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఇండస్ట్రీలో నాకు మార్పు కనిపిస్తోంది. మహిళా దర్శకులు రచయితలు ఇండస్ట్రీకి రావడం చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో కూడా ఇదే కోరుకుంటున్నాను" అని చెప్పింది రకుల్. అనంతరం ఒక విలేకరి జాకీ తో తన వివాహం ఎప్పుడు ఉంటుంది అని అడగగా ప్రస్తుతం తన దృష్టి మొత్తం కెరీర్ పైనే ఉందని చెప్పుకొచ్చింది. "ఆ రోజు వచ్చినప్పుడు మీకు కచ్చితంగా చెబుతాను" అని అంటోంది రకుల్.

admin1

admin1

Next Story