అందాల రకుల్ @7 ఇయర్స్!

అందాల రకుల్ @7 ఇయర్స్!
x
Highlights

అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి నేటికి సరిగ్గా ఏడేళ్ళు అవుతుంది. 2013లో సందీప్ కిషన్ హీరోగా వచ్చిన వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో వెండితెర పై మెరిసింది ఈ భామ.

అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి నేటికి సరిగ్గా ఏడేళ్ళు అవుతుంది. 2013లో సందీప్ కిషన్ హీరోగా వచ్చిన వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో వెండితెర పై మెరిసింది ఈ భామ. ఇక ఆ తర్వాత లౌక్యం, సరైనోడు, పండగ చేస్కో, నాన్నకు ప్రేమతో, ధృవ సినిమాలు ఆమెకి వరుస విజయాలను అందించాయి. అయితే తన సినీ ప్రయాణం పట్ల రకుల్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. తన ప్రయాణం నవ్వులతో సాగిందని, దానికి ప్రధానమైన కారణం అభిమానుల ప్రేమేనని వెల్లడించింది. ఢిల్లీ నుంచి వచ్చిన పక్కా తెలుగమ్మాయిగా మారిన తన జర్నీ చాలా అందంగా ఉందని పేర్కొంది.

తనని నమ్మి అవకాశాలను ఇచ్చిన సహనటులకి, దర్శకనిర్మాతలకి ధన్యవాదాలు తెలిపింది ఈ అమ్మడు. రకుల్ కి కూడా అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక గత కొద్ది రోజులుగా తెలుగు సినిమాలకి దూరంగా ఉంటున్న రకుల్ తాజాగా నాగచైతన్య చేయబోయే ఓ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఇక నితిన్ హీరోగా వస్తున్న చెక్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అటు తమిళ్ లో భార‌తీయుడు 2 తో పాటుగా శివ‌కార్తికేయ‌న్ సినిమాలో ర‌కుల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక బాలీవుడ్ సీనియ‌ర్ హీరో అజ‌య్ దేవ‌గ‌ణ్ సరసన నటిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories