logo

బ్యాక్ గ్రౌండ్ కాదు టాలెంట్ ఉండాలి అంటున్న హీరోయిన్

బ్యాక్ గ్రౌండ్ కాదు టాలెంట్ ఉండాలి అంటున్న హీరోయిన్
Highlights

ఒకవైపు సినిమాలతో మరొకవైపు వెబ్ సిరీస్ తో రాణిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం...

ఒకవైపు సినిమాలతో మరొకవైపు వెబ్ సిరీస్ తో రాణిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం లో ముందు ఉంటుందన్న విషయం తెలిసిందే. తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు నూటికి నూరు శాతం నిజం అంటున్నారు నెటిజన్లు. నెపోటిజం గురించి రాధిక ఆప్టే ఈ మధ్యనే మాట్లాడిన విషయం తెలిసిందే. బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ టాలెంట్ ఉంటే వారు స్టార్స్ అవుతారు అని ఆమె అన్నారు. కొందరు బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ స్టార్స్ కాలేకపోయారు అందుకే కేవలం బ్యాక్ గ్రౌండ్ తో ఏమి అవ్వదు, కష్టపడే తత్వం, టాలెంట్ ఉంటేనే స్టార్స్ అవుతారు అని రాధికా ఆప్టే చెప్పుకొచ్చింది.

ఇక ఆడవారిపై లైంగిక వేధింపులు జరుపుతున్న విషయం నిజమేనని, కాస్టింగ్ డైరెక్టర్ల వల్ల ఇది ఎక్కువగా జరుగుతుందని ఆమె అన్నారు. యాక్టర్ లను ఎంపిక చేసే కాస్టింగ్ డైరెక్టర్ లు కొందరు చాలా నీచంగా ప్రవర్తిస్తారని వారి వల్లనే ఇండస్ట్రీ కి చెడ్డ పేరు వస్తోంది అని ఆమె పేర్కొన్నారు. ఇక హీరో హీరోయిన్లకు ఒకే రెమ్యూనరేషన్ విషయంపై మాట్లాడుతూ "సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోకు 200 కోట్ల రూపాయలు వసూలు చేయగల సత్తా ఉంది. నాలాంటి నటి కి కేవలం కోటి రూపాయలు మాత్రమే చేయగల అవకాశం ఉంది. అలాంటిది ఇద్దరికీ ఒకటే రెమ్యూనరేషన్ ఎలా డిమాండ్ చేస్తారు. అందుకే హీరో కంటే తక్కువ ఇస్తున్నారని నేను ఫీల్ అవ్వను" అంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. ఆమె మాటల్లో నిజం ఉంది అని అభిమానులు కూడా వత్తాసు పలుకుతున్నారు.

లైవ్ టీవి

Share it
Top