Rachel White Coronavirus Positive: మరో బాలీవుడ్ నటికి కరోనా పాజిటివ్!

Actress Rachel White Tested Corona Positive: దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.

Krishna
Published on: 13 July 2020 1:50 PM IST
Rachel  White Coronavirus Positive: మరో బాలీవుడ్ నటికి కరోనా పాజిటివ్!
X
Coronavirus

Actress Rachel White Tested Corona Positive: దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.. ఇక కరోనా వైరస్ సినీ ఇండస్ట్రీని కూడా వదలడం లేదు.. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా బాలీవుడ్ న‌టులు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, ఆమె కుమార్తె ఆరాధ్య కరోనా సోకిన సంగతి తెలిసిందే. తాజాగా మరో బాలవుడ్ నటీకి కరోనా నిర్ధారణ అయింది. బాలీవుడ్ నటి రాచెల్ వైట్‌కి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ఖాతాలో స్పష్టం చేసింది.

గత కొద్దిరోజులుగా దగ్గు జ్వరం లాంటి లక్షణాలు కనిపించడంతో ఆమె కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. అందులో ఆమెకి కరోనా పాజిటివ్ అని తేలింది.. ప్రస్తుతం ఆమె కోల్‌కతాలోని తన నివాసంలో హోం క్వారంటైన్‌లో ఉన్నారు. అయితే ఆమె ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... ''పానిక్ కావొద్దు, భయపడాల్సిన పనిలేదు" అభిమానులకి దైర్యం చెప్పారు.. కంగనా రనౌత్, ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్రల్లో నటించిన ఉంగ్లీ సినిమాలో రాచెల్ వైట్ నటించింది. అలాగే బెంగాలీ చిత్రం 'హర్ హర్ బ్యోమ్‌కేష్'‌లో కూడా ఆమె కీలకపాత్రలో నటించి మెప్పంచింది.

ఇక అటు దేశంలో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి

గడిచిన 24 గంటల్లో భారత్‌ లో 28,701 కేసులు నమోదు కాగా, 500 మంది ప్రాణాలు విడిచారు. తాజా కేసులతో కలిపి దేశంలో కేసుల సంఖ్య 8,78,254 కి చేరుకుంది.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3,01,609 ఉండగా, 5,53,471 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 23,174 మంది కరోనా వ్యాధితో మరణించారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,19,103 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 1,18,06,256 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.


Krishna

Krishna

Next Story