నన్ను ఎవరు వేధించలేదు - రాశి ఖన్నా

Ruthvik
Published on: 7 March 2019 4:20 PM IST
నన్ను ఎవరు వేధించలేదు - రాశి ఖన్నా
X

"ఊహలు గుస గుసలాడే" లాంటి రొమాంటిక్ సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా ఇక్కడ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని ఏర్పాటు చేసుకుంది రాశి ఖన్నా. ఆ సినిమా తరువాత ఈ భామకి తెలుగు లో వరుస అవకాశాలు వచ్చాయి, ఇక తెలుగు తో పాటు తమిళ్ లో కూడా అడపా దడపా సినిమాలు చేస్తున్న ఈ భామ మీటూ ఉద్యమం గురించి నోరు విప్పింది. వేధింపులకు గురి అవుతున్నవారు ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పడం చాలా గొప్ప విషయం.

వారు ఎదుర్కొంటున్న చేదు అనుభవాలను బయట బయటకు వచ్చి నిర్భయంగా చెప్పగలగడం మాములు విషయం కాదు దానికి ఎంతో ధైర్యం కావాలి. అలాంటి వాళ్ళ ధైర్యాన్ని మనం అభినందించాలి. ఇకపోతే మీటూ ఉద్యమంపై చెప్పేందుకు ప్రత్యేకంగా తనవద్ద ఏమీ లేదని, అదేసమయంలో తన తొలి సినిమా వరకు ఇప్పటివరకు తాను ఎలాంటి లైంగిక వేధింపులకు గురికాలేదు అని రాశి ఖన్నా చెప్పింది. ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ తనని భాగానే చూసుకుంటున్నారు అని అలాగని చెప్పి ఇండస్ట్రీ లో లైంగిక వేధింపులు లేవని కాదు అని ఈ భామ చెప్పుకొచ్చింది.

Ruthvik

Ruthvik

Next Story