Raai Laxmi-Dhoni: ధోనితో అందుకే బ్రేకప్.. లక్ష్మీరాయ్‌ షాకింగ్‌ కామెంట్‌!

Raai Laxmi-Dhoni: ఎంద‌రో క్రికెట‌ర్లు బాలీవుడ్ హీరోయిన్ల‌తో చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగారు.

Arun Chilukuri
Published on: 4 Dec 2021 4:44 PM IST
Actress Raai Laxmi Revealed the Relationship With MS Dhoni
X

Raai Laxmi-Dhoni: ధోనితో అందుకే బ్రేకప్.. లక్ష్మీరాయ్‌ షాకింగ్‌ కామెంట్‌!

Raai Laxmi-Dhoni: ఎంద‌రో క్రికెట‌ర్లు బాలీవుడ్ హీరోయిన్ల‌తో చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగారు. వారిలో కొన్ని జంట‌లు పెళ్లిపీట‌లెక్క‌గా మ‌రికొన్ని జంట‌లు మ‌నస్ఫ‌ర్ధ‌ల‌తో విడిపోయి వేరే వారిని వివాహం చేసుకుని జీవితంలో స్థిర‌ప‌డ్డారు. టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ, లక్ష్మీ రాయ్‌ మధ్య అప్పట్లో లవ్‌ ట్రాక్‌ నడిచిన విషయం తెలిసిందే. రాయ్ లక్ష్మీ‌తో ధోని డేటింగ్ వ్యవహారం పెళ్లి వరకు వెళ్తుందని అనుకున్నారు. కాని ఊహించని విధంగా ధోని, రాయ్ లక్ష్మీ ఏడాదిలోపే బ్రేకప్ చెప్పుకున్నారు. రాయ్ లక్ష్మీతో బ్రేకప్ తర్వాత మహేంద్ర సింగ్ ధోని సాక్షిని పెళ్లి చేసుకున్నాడని సెలబ్రిటీ వర్గాల్లో టాక్. తాజాగా ధోనితో లవ్‌ ట్రాక్‌ నడిపిన విషయంపై రాయ్ లక్ష్మి స్పందించింది. తన జీవితంలో ఎంఎస్ ధోని‌తో ప్రేమ వ్యవహారం వైఫల్యం గురించి తాజా ఇంటర్యూలో మాట్లాడారు. ఎందుకు విడిపోవాల్సి వచ్చిందన్న విషయంపై ఆమె క్లారిటీ ఇచ్చింది.

ధోనితో కొనసాగించిన రిలేషన్‌ తన జీవితంలో ఓ మచ్చగా మిగిలిపోయిందని పేర్కొంది. తనతో బ్రేకప్‌ జరిగి 12 ఏళ్లు గడిచిన ఈ విషయం ఇప్పటికీ తనను వెంటాడుతూనే ఉందన్నారు. ధోని గురించి మీడియాలో ఏదైన చర్చ వస్తే.. తన పేరును ప్రసావిస్తున్నారని వాపోయింది. తనకు పెళ్లై, పిల్లలు పుట్టినా ధోనితో అఫైర్‌ గురించి మాట్లాడుతూనే ఉంటారేమోనని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాము బ్రేకప్‌ చెప్పుకున్నప్పటికీ ఒకరిపై ఒకరికి గౌరవం ఉందన్నారు. ధోనీ తర్వాత తన జీవితంలో చాలా బ్రేకప్స్‌ జరిగాయని, కానీ వాటిని ఎవరూ గమనించలేదని చెప్పింది. ప్రస్తుతం తన దృష్టి కెరీర్‌ పైనే ఉందని, పెళ్లి ఆలోచన ఇప్పట్లోదేని స్పష్టం చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story