Priyamani: 'నేనేదో దేశద్రోహం చేసినట్లు కామెంట్స్ చేశారు'..

Priyamani: 2003లో వచ్చిన 'ఎవరే అతగాడు' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది అందాల తార ప్రియమణి.

Actress Priyamani Shares her bad Experience When she got Married
X

Priyamani: 'నేనేదో దేశద్రోహం చేసినట్లు కామెంట్స్ చేశారు'..

Priyamani: 2003లో వచ్చిన 'ఎవరే అతగాడు' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది అందాల తార ప్రియమణి. ఆ తర్వాత వరుసగా తమిళ, మలయాళం సినిమాల్లో నటించే అవకాశం కొట్టేసిందీ బ్యూటీ. ఇక 2007లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన యమదొంగ సినిమాతో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత వరుసగా విజయవంతమైన సినిమాల్లో నటించింది.

ఇక నటిగా బిజీగా ఉన్న సమయంలోనే 2017లో ముస్తాఫా రాజ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వివాహం తర్వాత కొన్ని రోజులు సినిమాలకు గ్యాప్‌ ఇచ్చిన ఈ బ్యూటీ నారప్పతో మళ్లీ తెలుగులో సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఇక ప్రస్తుతం సినిమాలతోపాటు వెబ్‌ సిరీస్‌లో నటిస్తూ మెప్పిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకుందీ బ్యూటీ.

తాను మతాంతర వివాహం చేసుకున్న సమయంలో వచ్చినన్ని ట్రోల్స్‌ మరెవరిపై రాలేదని వాపోయింది. ఆ సమయంలో తాను ఏదో దేశద్రోహం చేసినట్టు రెచ్చిపోయి మరీ కామెంట్లు పెట్టేవారని గతాన్ని గుర్తు చేసుకుంది ప్రియమణి. అయితే మనసులు కలవడానికి కులమతాలు అడ్డుకావు. ముస్తాఫా రాజ్‌ నాకెంతోకాలంగా తెలుసని, తమ అభిప్రాయాలు, అభిమతాలు కలిశాయని చెప్పుకొచ్చింది.

ఇక తమ వివాహం అయ్యి ఎనిమిదేళ్లు గడుస్తున్నా.. ఈ రోజుకు కూడా తమ పెళ్లి విషయంలో ట్రోల్స్‌ వస్తూనే ఉన్నాయని వాపోయిన ప్రియమణి.. మొదట్లో ఈ ట్రోల్స్‌ వల్ల బాధపడేదాన్నని కానీ.. ఇప్పుడు అలవాటు పడిపోయానని చెప్పుకొచ్చింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story