Top
logo

Priyamani: విద్యాబాలన్ తో రిలేష‌న్ బ‌య‌ట పెట్టిన ది ఫ్యామిలీ మ్యాన్ న‌టి

Actress Priyamani Responds Relation With Bollywood Actress Vidhyabalan | Priyamani and Vidya Balan Relationship
X

Priyamani and Vidhyabalan (File Photo )

Highlights

Priyamani: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాల‌న్ తో ఉన్న రిలేష్ బ‌య‌ట పెట్టింది తెలుగు న‌టీ ప్రియ‌మ‌ణి.

Priyamani and Vidya Balan Relationship: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాల‌న్ తో ఉన్న రిలేష్ బ‌య‌ట పెట్టింది తెలుగు న‌టీ ప్రియ‌మ‌ణి. విద్యాబాలన్ వరుసకు అక్క అవుతారని చెప్పుకొచ్చింది. కెరీర్ మొద‌ట్లో ఈ విష‌యం ఏవ‌రికి చెప్ప‌లేద‌ని అన్నారు. విద్యాబాలన్ త‌న‌కు నాకు రెండో కజిన్.. అంటే మా పూర్వీకులతో మేం కనెక్టయి ఉన్నప్పుడు ఈ బంధం బయటపడింది. అలాగని మేం తరచూ కలుసుకునేదేమీ లేదు. మా తల్లిదండ్రులు వారిని కలిసినది లేదు. కానీ రిలేషన్ మాత్రం ఉంది అని ప్రియ‌మ‌ణి చెప్పింది.

నేను ముంబై మీడియాలో విద్యా పేరును బౌన్స్ చేస్తే నాకు ఎక్కువ మైలేజ్ లభిస్తుంది. కాని నేను ఆ ఆలోచనకు పూర్తిగా విముఖంగా ఉన్నాను. నిచ్చెన పైకి ఎక్కడానికి వారి లింకుల గురించి కొంతమంది ప్రగల్భాలు పలుకుతారు. కానీ నేను అలాంటిదానిని కాదు. ప్రతిభను భర్తీ చేయలేము అని ప్రియమణి అన్నారు. ప్రియమణి ప్రస్తుతం ది ఫ్యామిలీ మ్యాన్ 2లో నటించగా.. విద్యా నటించిన కొత్త చిత్రం షెర్ని విడుదలకు సిద్ధమవుతోంది. ఇది ప్రైమ్ వీడియోలో కూడా స్ట్రీమింగ్ కానుంది.

అంతేకాదు తాను విద్యాబాలన్ లాంటి పెద్ద స్టార్ పేరును ఉపయోగించుకుంటే బాలీవుడ్ లో ఎంతో ఉపయోగపడేదే.. కానీ అలాంటి ఆలోచనేమీ లేదని ప్రతిభ ఇక్కడ చాలా చూస్తారని ప్రియమణి వెల్లడించారు. తాజాగా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2లో ప్రియమణి సీజన్ 1 పాత్రకు కొనసాగింపుగా నటించింది. మనోజ్ భాజ్ పాయ్ భార్యగా విరోధిగా కనిపించింది. భర్త శ్రీకాంత్ తివారీకి చిక్కులు తెచ్చిపెట్టే పాత్ర తనది.

ది డర్టీ పిక్చర్- తుమ్హారీ సులు - కహానీ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన విద్యాబాలన్ కు .. ఎన్నో సౌత్ బ్లాక్ బస్టర్లలో నటించిన ప్రియమణి కి మధ్య కొన్ని సారూప్యతలు ఉన్నాయి. ఆ ఇద్దరూ జాతీయ అవార్డ్ గ్రహీతలు. ప్రతిభావంతులుగా వెలిగిపోయారు.``మా తల్లిదండ్రులు మేము తరచూ కలవము. బాలన్ మా కుటుంబం అని చెప్పుకునేందుకు నేను చాలా గర్వపడతాను`` అంటూ రావణ్ సమయంలో ప్రియమణి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రావణ్ హిందీ - తమిళ వెర్షన్లలో ప్రియమణి కనిపించింది.

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన రక్త చరిత్రా II ప్రమోషన్స్ లోనూ బాలన్ నేను రెండవ దాయాదులం అంటూ వ్యాఖ్యానించడం ఆసక్తిని కలిగిచింది. మేము వ్యక్తిగత స్థాయిలో సన్నిహితంగా లేము. కానీ నేను బాలన్ తండ్రి గారితో చేరువగా ఉన్నాను. నేను ముంబైకి వచ్చినప్పుడల్లా తన తండ్రిని పిలుస్తాను. వీలైతే నేను ఏదో ఒక రోజు విద్యాను కలవడానికి ఇష్టపడతాను...అని వ్యాఖ్యానించారు. నా రెండవ కజిన్ నుండి ఏ సినిమాల్లో సంతకం చేయాలో లేదా చేయకూడదనే దాని గురించి నేను చిట్కాలు తీసుకోవలసిన అవసరం లేదు. ఆమె సలహా తీసుకోవటానికి నాకు చాలా స్వేచ్ఛ ఉంది.. కానీ అలా చేయను అని అన్నారు.

Web TitleActress Priyamani Responds Relation With Bollywood Actress Vidhyabalan | Priyamani and Vidya Balan Relationship
Next Story