Top
logo

తరుణ్ తో ప్రేమ.. క్లారిటీ ఇచ్చిన ప్రియమణి

తరుణ్ తో ప్రేమ.. క్లారిటీ ఇచ్చిన ప్రియమణి
X
Highlights

2003లో వచ్చిన ఎవరే అతగాడు సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది నటి ప్రియమణి. ఈ సినిమా ప్రియమణికి అంతగా గుర్తింపును ఇవ్వలేకపోయింది.

2003లో వచ్చిన ఎవరే అతగాడు సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది నటి ప్రియమణి. ఈ సినిమా ప్రియమణికి అంతగా గుర్తింపును ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత జగపతిబాబు హీరోగా వచ్చిన పెళ్ళైన కొత్తలో సినిమా ప్రియమణికి మంచి ఫేం ని తీసుకువచ్చింది. ఈ సినిమా తర్వాత నవవసంతం, టాస్, ద్రోణా, ప్రవరాఖ్యుడు, శంభో శివ శంభో మొదలగు చిత్రాలలో నటించింది ప్రియమణి. అయితే ప్రియమణికి ఎక్కువగా ఫ్యామిలీ మూవీస్ కే మంచి పేరు వచ్చింది.

ఇక ఇదిలా ఉంటే ప్రియమణి, తరుణ్ కలిసి నవవసంతం సినిమాలో నటించారు. 2007లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను బాగా అలరించింది. అయితే ఈ సినిమా చేస్తున్న టైంలో ప్రియమణి-తరుణ్‌ ఒకరికి ఒకరు ప్రేమలో ఉన్నారని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోనున్నారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే వాటిపైన తాజాగా ప్రియమణి ఓ ఇంటర్వ్యూలో స్పందించింది.

నవవసంతం మూవీ షూటింగ్ టైంలో తరుణ్ నేను ప్రేమలో ఉన్నామని, పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఒకరోజు తరుణ్ అమ్మ రోజారమణి గారు సినిమా సెట్‌కి వచ్చి మీ ఇద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారా? ఒకవేళ అదే కనుక నిజమైతే పెళ్లి చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరాల్లేవు. ఏదైనా సరే నువ్వు నాతో ఫ్రెండ్లీగా చెప్పవచ్చు అని అన్నారు. కానీ తరుణ్ తానూ మంచి స్నేహితులం మాత్రమేనని చెప్పినట్టుగా ప్రియమణి వెల్లడించింది.

ఇక ప్రస్తుతం ప్రియమణి, వెంకటేష్ హీరోగా వస్తున్న నారప్ప సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్ నిర్మిస్తోంది. కరోనా వలన వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ తాజాగా మొదలైంది.

Web TitleActress priyamani respond on love with tarun
Next Story