PSPK28 - Priyamani: పవన్ కళ్యాణ్ సినిమాలో ప్రియమణి స్పెషల్ రోల్..!!

* పవన్ కళ్యాణ్ అతి త్వరలోనే హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టనున్నారు అని సమాచారం.

admin1
Updated on: 4 Sept 2021 4:15 PM IST
Actress Priyamani Playing a Key Role in Pawan Kalyan Harish Shankar PSPK28 Movie
X

పవన్ సినిమాలో ప్రియమణి స్పెషల్ రోల్ (ఫైల్ ఫోటో)

PSPK28 - Priyamani: రెండేళ్లపాటు సినిమాల నుంచి దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "వకీల్ సాబ్" సినిమాతో ఎంట్రీ ఇచ్చిన దగ్గర్నుంచి వరుసగా సినిమాలు చేస్తూ కెరియర్లో ముందుకు దూసుకు పోతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న "హరిహర వీరమల్లు" సినిమా షూటింగ్ మొదలు పెట్టేసారు. మరో వైపు సాగర్ కే చంద్ర దర్శకత్వంలో మలయాళంలో సూపర్ హిట్ అయిన "అయ్యప్పనుమ్ కోషీయుమ్" సినిమా రీమేక్ ఆయన "భీమ్లా నాయక్" షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ అతి త్వరలోనే హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టనున్నారు అని సమాచారం.

మొదట ఈ సినిమా షూటింగ్ ను దసరా నుండి ప్రారంభించాలని అనుకున్నారు. స్టార్ బ్యూటీ పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనుంది అని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉండబోతుందట. ఆ పాత్ర కోసం దర్శక నిర్మాతలు ప్రియమణిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే "నారప్ప" సినిమాలో వెంకటేష్ భార్య గా కనిపించిన ప్రియమణి రానా హీరోగా నటిస్తున్న "విరాటపర్వం" సినిమాలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలో ప్రియమణి పాత్ర స్పెషల్ గా ఉండబోతోందని సమాచారం.

admin1

admin1

Next Story