Prema: నాలుగు ప‌దుల వ‌య‌సులో రెండో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన ప్రేమ‌

Actor Prema: ధర్మ చక్రం చిత్రంతో హీరోయిన్ గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ప్రేమ.

Samba Siva Rao
Updated on: 3 Jun 2021 3:14 PM IST
Actress Prema Responds on his Second Marriage
X

 ప్రేమ పాతచిత్రం 

Actor Prema: ధర్మ చక్రం చిత్రంతో హీరోయిన్ గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ప్రేమ. త‌న‌ అమాయకత్వం, అందం. అభినయంతో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసింది. అప్ప‌టి వ‌ర‌కు త‌క్క‌వ సినిమాలే చేసిన ప్రేమ‌.. దేవి సినిమా ఆమె స్థాయినే మార్చేసింది. నాగదేవ‌త‌గా న‌టించిన ప్రేమను చూసిన ప్రేక్షకులు ఆమె ఏప్పుడు క‌నిపించిన ఆ పాత్ర చ‌ర్చించుకుంటారు. ఆ సినిమా అంత‌లా సంచనలం సృష్టించింది. కన్నడ, తమిళ్, తెలుగు అని తేడా లేకుండా అన్ని భాషల్లో నటించింది ప్రేమ. అయితే ప్రేమ హీరోయిన్ గా కెరీర్ అతి తక్కువ కాలమే.. అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి వరసగా సినిమా అవకాశాలను అందుకుంటుంది.

అయితే ప్రేమ వ్యక్తిగత జీవితంపై అనేక వార్త‌లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి.. ముఖ్యంగా ప్రేమ ఆరోగ్యం గురించి.., రెండో పెళ్లి గురించి వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ విషయం పై ప్రేమ ఓ ఇంటర్యూలో స్పందించింది. 2006లో జీవన్ అప్పచ్చు అనే ఒక వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే కొన్నాళ్లకు వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో విడాకులు తీసుకున్నారు.ప్రేమ త‌న వ్య‌క్తిగ‌త జీవితం గురించి ఎప్పుడు స్పందించ‌లేదు.

అయితే ప్రేమ త‌న ఆరోగ్యం గురించి సంచ‌ల‌న విష‌యం చెప్పి అభిమానులను దుఖంలో ముంచింది. ఆమె క్యాన్స‌ర్ బారిన ప‌డిన‌ట్లు చెప్పింది. అయితే క్యాన్సర్ ను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని చెప్పింది. అంతా బాగానే ఉంది ఇంత‌లోనే ప్రేమ రెండ పెళ్లిపై సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం సాగింది. అయిత‌న‌ తన రెండో పెళ్లి పై వస్తున్న వార్తల్లో నిజం లేదని.. ఒంటరిగా ఉన్నానని తెలిపింది. పిల్లలున్నారు అనే వార్తలు కూడా అవాస్తవమని కొట్టిపడేసింది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story